IND W vs SA W : విశాఖ వేదికగా నేడు భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఏ జట్టుకు లాభమంటే..?
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నేడు భారత్, దక్షిణాప్రికా జట్లు (IND W vs SA W) తలపడనున్నాయి.

Womens ODI World Cup 2025 rain threat to IND W vs SA W match
IND W vs SA W : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో నేడు భారత్, దక్షిణాప్రికా జట్లు (IND W vs SA W) తలపడనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో (శ్రీలంక, పాకిస్తాన్) గెలిచిన భారత్ మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని ఆరాటపడుతోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో కంగుతిన్నాక న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది దక్షిణాఫ్రికా.
విశాఖ స్టేడియంలో ఇప్పటి వరకు భారత్ ఐదు మ్యాచ్‌లు ఆడగా అన్నింటిలోని విజయం సాధించడం గమనార్హం. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధానను రాణిస్తే ఈ మెగాటోర్నీలో ముచ్చటగా మూడో విజయం సాధించడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు.
Smriti Mandhana : దక్షిణాఫ్రికాతో మ్యాచ్.. స్మృతి మంధానను ఊరిస్తున్న ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు..
అలాగని దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఓపెనర్ తజ్మిన్ బ్రిట్స్ భీకరఫామ్‌లో ఉంది. ఆమెతో పాటు సునెలుజ్, కెప్టెన్ లారా వోల్వార్ట్, మరిజేన్ కాప్, అనెకె బోష్, క్లో ట్రైయాన్‌లతో కూడిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది.
హెడ్-టు-హెడ్..
భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటి వరకు ముఖాముఖిగా 33 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా దక్షిణాఫ్రికా 12 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
పిచ్..
విశాఖ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్లకు కూడా సహకారం బాగానే ఉంటుంది.
వాతావరణం..
అక్యూవెదర్ ప్రకారం మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 75 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది.
Rashid Khan : చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. వన్డే క్రికెట్‌లో అఫ్గాన్ ప్లేయర్లలో ఒకే ఒక్కడు..
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే.. అప్పుడు భారత్, దక్షిణాఫ్రికా జట్లకు చెరొక పాయింట్‌ను కేటాయిస్తారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో కొనసాగుతోంది.
స్క్వాడ్‌లు..
దక్షిణాఫ్రికా మహిళల జట్టు..
లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్ ), అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, మారిజాన్ కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జాఫ్తా, నాన్‌కులులెకో మ్లాబా, అన్నరీ డెర్క్‌సెన్, అన్నెక్ బాష్, మసబాటా క్లాస్, సునే లూయస్, కరాబో మెసో, తుమీ సెఖుఖునే, నొందుమిసో షాంగసే
భారత మహిళల జట్టు..
ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్ , దీప్తి శర్మ , రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ఉమా చెత్రీ