IND w Vs AUS w : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌.. మూడు మార్పులతో భారత్

మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో భాగంగా గురువారం భార‌త్‌, ఆసీస్ జ‌ట్ల మ‌ధ్య (IND w Vs AUS w) సెమీఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభ‌మైంది.

IND w Vs AUS w : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌.. మూడు మార్పులతో భారత్

IND w Vs AUS w Womens World Cup 2025 Semi final Australia Women opt to bat

Updated On : October 30, 2025 / 2:56 PM IST

IND w Vs AUS w : మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో భాగంగా గురువారం న‌వీ ముంబైలోని డీవై పాటిల్ స్టోర్స్ అకాడ‌మీ వేదిక‌గా జ‌రుగుతున్న సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు (IND w Vs AUS w )త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత బౌలింగ్ చేయ‌నుంది.

‘బ్యాటింగ్ పిచ్‌గా క‌నిపిస్తోంది. అందుక‌నే మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాం. భార‌త్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తాం. గాయం కార‌ణంగా నాకు 10 రోజులు విశ్రాంతి ల‌భించింది. ఇది సెమీఫైన‌ల్ మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో ఎవ‌రు బాగా ఆడ‌తారో వారే ముందడుగు వేస్తారు.’ అని ఆసీస్ కెప్టెన‌ అలీసా హీలీ తెలిపింది.

Ben Austin : క్రికెట్ ప్ర‌పంచంలో తీవ్ర విషాదం.. ఫిల్ హ్యూస్ త‌ర‌హాలోనే.. మెడ‌కు బంతి త‌గిలి 17 ఏళ్ల యువ క్రికెట‌ర్ మృతి

‘టాస్ గెలిస్తే మేము ముందుగా బ్యాటింగ్ చేయాల‌ని భావించాము. ఆదిలోనే వికెట్లు తీస్తే ఆసీస్‌ను త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు. గ‌త రెండు మ్యాచ్‌లు కూడా మేము ఈ పిచ్‌పై ఆడాము. దీంతో పిచ్ గురించి మంచి అవ‌గాహ‌న ఉంది. దురదృష్ట‌వ‌శాత్తు ప్ర‌తీకా గాయంతో ఈ టోర్నీకి దూర‌మైంది. ఆమె స్థానంలో ష‌ఫాలీ వ‌ర్మ వ‌చ్చింది. ఇక ఉమా, హ‌ర్లీన్ స్థానాల్లో రిచా, క్రాంతి లు ఆడుతారు.’ అని హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ తెలిపింది.

IND W vs AUS W : అదే జరిగితే టీమ్ఇండియా ఖేల్ ఖ‌తం.. హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌కు మ‌రో టెన్ష‌న్‌..!

ఆసీస్ తుది జ‌ట్టు ఇదే..
అలీసా హీలీ (కెప్టెన్‌), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్, ఎలీస్‌ పెర్రీ, బెత్‌ మూనీ, అనాబెల్‌ సదర్లాండ్, ఆష్లీ గార్డ్‌నర్, తాలియా మెక్‌గ్రాత్, సోఫీ మోలనూ, అలానా కింగ్, కిమ్‌ గార్త్, మెగాన్‌ షట్‌

భార‌త తుది జ‌ట్టు ఇదే..
స్మృతి మంధాన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్, రాధ యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుక సింగ్‌.