ODI World Cup-2023: జస్ట్ 95 పరుగుల తేడాతో బాబర్ అజాం సెంచరీ మిస్.. మీమ్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు

బాబర్ అజాం కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అందుకోసం 18 బంతులు ఆడాడు.

ODI World Cup-2023: జస్ట్ 95 పరుగుల తేడాతో బాబర్ అజాం సెంచరీ మిస్.. మీమ్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు

Babar Azam Memes

Updated On : October 6, 2023 / 8:57 PM IST

Babar Azam Memes: బాబర్ అజాం.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇతడు. వన్డేల్లో ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. భారత్ లో జరుగుతోన్న వన్డే ప్రపంచ కప్-2023లో బాబర్ అజాంను నిలువరించకపోతే ఏ జట్టయినా సరే పాక్ పై గెలవడం కష్టమేనని కొందరు విశ్లేషకులూ అన్నారు.

ఎన్నో అంచనాల మధ్య బాబర్ అజాం ప్రపంచ కప్-2023లో తొలి మ్యాచు ఆడాడు. అది కూడా క్రికెట్లో పసికూనగా భావించే నెదర్లాండ్స్ జట్టుతో. అయినప్పటికీ 18 బంతులను ఎదుర్కొని కేవలం 5 పరుగులే చేశాడు బాబర్ అజాం. దీంతో అతడిపై నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తున్నారు.

ప్రపంచ కప్-2023లో ఏదో చేసేస్తాడని, జట్టు భారాన్నంతా తన భుజాలపైనే మోస్తాడని అనుకుంటే ఇంత తక్కువ పరుగులకే అతడు ఔట్ అయ్యాడని నెటిజన్లు వాపోతున్నారు. బాబర్ అజాం కేవలం 95 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడని కొందరు సెటైర్లు వేశారు. ప్రపంచ నంబర్ 1 బ్యాటర్ అంటే ఇలా ఉండాలంటూ మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు. టీమిండియా బ్యాటర్ కోహ్లీతో బాబర్ అజాంను ఇక పోల్చొద్దని నెటిజన్లు అంటున్నారు. మీమ్స్ చూసి హాయిగా నవ్వుకోండి..

World Cup 2023 PAK vs NED : హైదరాబాద్ లో మ్యాచ్.. పాకిస్థాన్ ఆలౌట్..