World Cup 2023 SA vs NED: మ‌రో సంచ‌ల‌నం.. ద‌క్షిణాఫ్రికా పై 38 ప‌రుగుల తేడాతో నెద‌ర్లాండ్స్ ఘ‌న విజ‌యం

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సంచ‌ల‌నాలు న‌మోదు అవుతున్నాయి. మొన్నఇంగ్లాండ్ జ‌ట్టును అఫ్గానిస్థాన్ ఓడించ‌గా తాజాగా ద‌క్షిణాఫ్రికాను నెద‌ర్లాండ్స్ చిత్తు చేసింది.

World Cup 2023 SA vs NED: మ‌రో సంచ‌ల‌నం.. ద‌క్షిణాఫ్రికా పై 38 ప‌రుగుల తేడాతో నెద‌ర్లాండ్స్ ఘ‌న విజ‌యం

world cup 2023 sa vs ned odi live updates and highlights in telugu

Updated On : October 17, 2023 / 11:02 PM IST

నెద‌ర్లాండ్స్ ఘ‌న విజ‌యం..
భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సంచ‌ల‌నాలు న‌మోదు అవుతున్నాయి. మొన్నఇంగ్లాండ్ జ‌ట్టును అఫ్గానిస్థాన్ ఓడించ‌గా తాజాగా ద‌క్షిణాఫ్రికాను నెద‌ర్లాండ్స్ చిత్తు చేసింది. ధ‌ర్మ‌శాల వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో 38 ప‌రుగుల తేడాతో నెద‌ర్లాండ్స్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 246 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా 42.5 ఓవ‌ర్ల‌లో 207 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో డేవిడ్ మిల‌ర్ల్ (43), ఆఖ‌ర్లో కేశ‌వ్ మ‌హారాజ్ (40) లు రాణించారు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ద‌క్షిణాఫ్రికాకు ఓట‌మి త‌ప్ప‌లేదు. నెద‌ర్లాండ్స్ బౌల‌ర్ల‌లో లోగాన్ వాన్ బీక్, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, బాస్ డి లీడే త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. కోలిన్ అకెర్‌మాన్ ఓ వికెట్ తీశాడు.

ర‌బాడ ఔట్‌.. 
బాస్ డి లీడే బౌలింగ్‌లో ర‌బాడ (9) ఔట్ అయ్యాడు. దీంతో 35.1వ ఓవ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికా 166 ప‌రుగుల వ‌ద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

గెరాల్డ్ కోయెట్జీ ఔట్‌..
బాస్ డి లీడే బౌలింగ్‌లో కోయెట్జీ (22) ఔట్ అయ్యాడు. దీంతో 33.1వ ఓవ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికా 147 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

మిల్ల‌ర్ ఔట్‌..
వాన్ బీక్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్ల‌ర్ (43) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 31 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 145/7.

మార్కో జాన్సెన్ ఔట్..
ద‌క్షిణాఫ్రికా మ‌రో వికెట్ కోల్పోయింది. వాన్ మీకెరెన్ బౌలింగ్‌లోమార్కో జాన్సెన్ (9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 25 ఓవ‌ర్ల ద‌క్షిణాఫ్రికా స్కోరు 109/6.

క్లాసెన్ ఔట్‌..
ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. వాన్ బీక్ బౌలింగ్‌లో విక్ర‌మ్ జీత్ సింగ్ క్యాచ్ అందుకోవ‌డంతో క్లాసెన్ (28) పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 18.5వ ఓవ‌ర్‌లో 89 ప‌రుగుల వద్ద ద‌క్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది.

44 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికా
నెదర్లాండ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా క‌ష్టాల్లో ప‌డింది. 44 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న‌ మార్‌క్ర‌మ్ ఒక్క ప‌రుగుకే ఔట్ కాగా.. వాన్ డ‌ర్ డుసెన్ నాలుగు ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 12 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 46/4. క్లాసెన్ (3), మిల్ల‌ర్ (1)లు ఆడుతున్నారు.

10 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 41/2
ల‌క్ష్య ఛేద‌న‌లో దక్షిణాఫ్రికా త‌డ‌బ‌డుతోంది. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రెండు వికెట్లు న‌ష్టానికి 41 ప‌రుగులు చేసింది. డికాక్ (20), బావుమా (16) లు ఔట్ అయ్యారు.

6 ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 31/0
246 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. డికాక్ (15) బవుమా(12) క్రీజ్ లో ఉన్నారు.

సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ 246 పరుగుల టార్గెట్ పెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన డచ్ టీమ్ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78) అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు. చివరల్లో ఆర్యన్ దత్ అదరగొట్టడంతో నెదర్లాండ్స్ మంచి స్కోరు చేసింది. ఆర్యన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు బాదాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడి, రబడ, జాన్సెన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

 

స్కాట్ ఎడ్వర్డ్స్ హాఫ్ సెంచరీ
స్కాట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఒక ఎండ్ లో వరుసగా వికెట్లు పడుతున్నా జాగ్రత్తగా ఆడి అర్ధశతకం సాధించాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికి 14వ హాఫ్ సెంచరీ. 40 ఓవర్లలో 204/8 స్కోరుతో నెదర్లాండ్స్ ఆట కొనసాగిస్తోంది.

 

150 దాటిన నెదర్లాండ్స్ స్కోరు
నెదర్లాండ్స్ స్కోరు 150 పరుగులు దాటింది. 35 ఓవర్లలో 156/7 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. తెలుగు బ్యాటర్ తేజ నిడమనూరు 20 పరుగులు చేసి అవుటయ్యాడు.

100 దాటిన నెదర్లాండ్స్ స్కోరు
నెదర్లాండ్స్ 26 ఓవర్లలో 105/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. తేజ నిడమనూరు 15, స్కాట్ ఎడ్వర్డ్స్ 16 పరుగులతో ఆడుతున్నారు.

కోలిన్ అవుట్.. నాలుగో వికెట్ డౌన్
నెదర్లాండ్స్ 15.1 ఓవర్ లో 50 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. కోలిన్ అకెర్‌మాన్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు.

లీడే అవుట్.. మూడో వికెట్ డౌన్
నెదర్లాండ్స్ 10.5 ఓవర్ లో 40 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది. బాస్ డి లీడే 2 పరుగులు చేసి అవుటయ్యాడు. 11 ఓవర్లలో 42/3 స్కోరుతో నెదర్లాండ్స్ ఆట కొనసాగిస్తోంది.

 

ఆరంభంలోనే నెదర్లాండ్స్ కు షాక్
నెదర్లాండ్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. విక్రమ్‌జిత్ సింగ్ 2, మాక్స్ ఓడౌడ్ 18 పరుగులు చేసి అవుటయ్యారు.

బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఎట్టకేలకు నెదర్లాండ్స్ బ్యాటింగ్ కు దిగింది. విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్ ఓపెనర్లుగా వచ్చారు. 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.

43 ఓవర్లకు ఆట కుదింపు
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం కావడంతో ఆటను 43 ఓవర్లకు కుదించారు. మధ్యాహ్నం 4 గంటలకు ఆట ప్రారంభం కానుంది. 1 నుంచి 9 ఓవర్ల మధ్య ఫస్ట్ పవర్ ప్లే, 10 నుంచి 35 ఓవర్లలో సెకండ్ పవర్ ప్లే.. 36 నుంచి 43 ఓవర్ల మధ్య మూడో పవర్ ప్లే ఉంటుంది. ముగ్గురు బౌలర్లు ఒక్కొక్కరు తొమ్మిది ఓవర్లు చొప్పున.. ఇద్దరు ఒక్కొక్కరు ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

మరోసారి వర్షం.. ఆట ఆలస్యం
టాస్ వేసిన తర్వాత మరోసారి వర్షం రావడంతో నెదర్లాండ్స్ బ్యాటింగ్ కు దిగడం ఆలస్యమైంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఆట ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఆట ఆలస్యమవుతోంది.

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో నెదర్లాండ్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. దక్షిణాఫ్రికా టీమ్ లో షమ్సీ స్థానంలో కోయెట్జీ జట్టులోకి వచ్చాడు. నెదర్లాండ్స్ టీమ్ లో ర్యాన్ క్లైన్ ప్లేస్ లో లోగాన్ వచ్చాడు.

 

తుది జట్లు
నెదర్లాండ్స్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దట్, పాల్ వాన్ మీకెరెన్

దక్షిణాఫ్రికా : క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, గెరాల్డ్ కోయెట్జీ

టాస్ ఆలస్యం
ప్రతికూల వాతావరణంతో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్ లో టాస్ వేయడం ఆలస్యమైంది. మధ్యాహ్నం 2.30 గంటలకు టాస్ వేయనున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే అవకాశముంది. వర్షపు జల్లులు పడటంతో మైదానం చిత్తడిగా ఉంది. పిచ్ ను కవర్లతో కప్పివుంచారు.

SA vs NED: దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్ల మధ్య నేడు వన్డే ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. ఇప్పటివరకు సౌతాఫ్రికా ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ రెండు మ్యాచ్ లు ఆడినా ఇంకా బోణి కొట్టలేదు. తమ జోరు కొనసాగించాలని దక్షిణాఫ్రికా, బోణి కొట్టాలని డచ్ టీమ్ బరిలోకి దిగుతున్నాయి.

సౌతాఫ్రికా భారీ స్కోరు చేస్తుందా?
దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు నమోదయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సఫారీ టీమ్ 400 ప్లస్ స్కోరు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ లను మరోసారి చెలరేగితే భారీ స్కోరు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

నెదర్లాండ్స్ షాక్ ఇస్తుందా?
డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టుపై అఫ్గానిస్థాన్ సంచలన విజయం సాధించడం.. నెదర్లాండ్స్ జట్టుకు బూస్టింగ్ ఇచ్చే అంశం. చిన్న జట్లను తేలిగ్గా తీసుకోవడానికి లేదడానికి అఫ్గానిస్థాన్ విజయమే ఉదాహరణ. కాగా, గత టి20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ దెబ్బకు సౌతాఫ్రికా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన విషయం క్రికెట్ ప్రేమికులు ఇంకా మర్చిపోలేదు.