WPL 2023, GujaratGiants vs RCB LiveUpdates In Telugu: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ జెయింట్స్ విజయం
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది.

WPL 2023, GujaratGiants vs RCB LiveUpdates In Telugu
WPL 2023, GujaratGiants vs RCB LiveUpdates In Telugu: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది.
నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
LIVE NEWS & UPDATES
-
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ జెయింట్స్ విజయం
విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ 11 పరుగులు తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది.
నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
-
ఆర్సీబీ 168/4
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. బ్యాటింగ్ కొనసాగుతోంది.
-
తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. స్మృతి మంధాన 18 పరుగులు చేసి ఔట్ అయింది. స్కోరు 59/1 (5.5/20)గా ఉంది.
-
2 ఓవర్లలో 20 పరుగులు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన 12, సోఫీ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు 20(2 ఓవర్లకు)గా ఉంది.
-
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లక్ష్యం 202 పరుగులు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు గుజరాత్ జెయింట్స్ 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లలో ఇద్దరు అర్ధ సెంచరీలు బాదారు. 27 బంతుల్లో 65 పరుగులు చేసి సోఫియా ఔట్ అయింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ 44 బంతుల్లో 67 పరుగులు చేసింది.
-
35 బంతుల్లో హర్లీన్ డియోల్ హాఫ్ సెంచరీ
గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసింది. ప్రస్తుతం గుజరాత్ స్కోరు 16.1 ఓవర్ల నాటికి 166/4గా ఉంది.
-
3 వికెట్లు కోల్పోయిన గుజరాత్ జెయింట్స్
గుజరాత్ జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయింది. గార్డ్ నర్ 19 పరుగులు చేసి ఔట్ అయింది. క్రీజులో డియోల్ (42), హేమలత (0) ఉన్నారు.
-
2 వికెట్లు కోల్పోయిన గుజరాత్ జెయింట్స్
గుజరాత్ జెయింట్స్ రెండు వికెట్లు కోల్పోయింది. 27 బంతుల్లో 3 సిక్సులు, 11 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసిన సోఫియా... శ్రేయాంకా పాటిల్ బౌలింగ్ లో ఔట్ అయింది. క్రీజులో డియోల్ (15), గార్డ్ నర్ (3) ఉన్నారు.
-
18 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన సోఫియా
గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ సోఫియా 18 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదింది. ప్రస్తుతం క్రీజులో సోఫియాతో పాటు డియోల్ ఉంది. గుజరాత్ స్కోరు 64/1 (6.0/20)గా ఉంది.
-
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ జెయింట్స్
గుజరాత్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 10 బంతులు ఆడిన మేఘన 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి ఔట్ అయింది. క్రీజులో సోఫియా (14), డియోల్ (0) ఉన్నాయి.
-
ఓపెనర్లుగా క్రీజులోకి మేఘన, సోఫియా
గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా క్రీజులోకి మేఘన, సోఫియా వచ్చారు.
-
బెంగళూరు జట్టు
హీథర్ నైట్, ఎల్లీస్ పెర్రీ, సోఫీ డివైన్, మేఘాన్ షట్, స్మృతి మంధాన, ప్రీతి బోస్, రేణుకా సింగ్, పూనమ్ ఖేమ్నార్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా.
-
గుజరాత్ జట్టు
కిమ్ గార్త్, సుష్మా వర్మ, స్నేహ రానా, మాన్సీ జోషి, సబ్బినేని మేఘన, ఆష్లీ గార్డ్ నర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాళన్ హేమలత, సోఫియా, తనూజా కన్వర్, హర్లీన్ డియోల్.
-
What does Women's Day mean to @imharleenDeol ?
Hear what the @GujaratGiants all-rounder said ? ?#TATAWPL | #GGvRCB pic.twitter.com/U31qiqN884
— Women's Premier League (WPL) (@wplt20) March 8, 2023
-
గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్
టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచు ముంబైలోని బ్రెబోర్న్ స్టేడియంలో జరుగుతోంది.
? Toss Update ?@GujaratGiants have elected to bat against @RCBTweets.
Follow the match ▶️ https://t.co/QeECVTM7rl #TATAWPL | #GGvRCB pic.twitter.com/yNaZDKYdHT
— Women's Premier League (WPL) (@wplt20) March 8, 2023