కీపర్ గా ధోనీ రికార్డును సాహా బ్రేక్ చేయనున్నాడా!
7అవుట్లతో పాటు మరో 9సాధిస్తే ధోనీని దాటేసే అవకాశం ఉంది. గురువారం నవంబరు 14న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా..

7అవుట్లతో పాటు మరో 9సాధిస్తే ధోనీని దాటేసే అవకాశం ఉంది. గురువారం నవంబరు 14న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా..
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోవడంతో వికెట్ కీపర్ గా మళ్లీ వృద్ధిమాన్ సాహాకే అవకాశం దక్కనుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం ఇండోర్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనున్నారు. చివరి సారిగా ఆడిన దక్షిణాఫ్రికాతో ఆడిన టెస్టు మ్యాచ్ తర్వాత భారత్ ఆడుతున్న మ్యాచ్ బంగ్లా జట్టుతోనే.
ఈ క్రమంలోనే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ రెండు టెస్ట్‌లకు టీమిండియా కీపర్ గా ఆడనున్న వృద్ధిమాన్ సాహా ముంగిట రెండు రికార్డులు ఉన్నాయి. వాటిలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు కూడా ఉంది. గతంలో బంగ్లా-భారత్ ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లలో ఎక్కువ వికెట్లు పడగొట్టిన రికార్డు ధోనీ పేరిట ఉంది.
మొత్తం ధోనీ చేసిన 15 అవుట్ లలో 12 క్యాచ్‌లు, మూడు స్టంప్‌లు ఉన్నాయి. ధోనీ తర్వాతి స్థానంలో 11 అవుట్ లతో బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రెహ్మన్ నిలిచాడు. వీరి తర్వాతి వరుసలో ఉన్న సాహా ఖాతాలో ఉన్న ఏడు అవుట్లతో పాటు మరో 9సాధిస్తే ధోనీని దాటేసే అవకాశం ఉంది. గురువారం నవంబరు 14న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది.