WTC Final: ఛాంపియన్ టెస్ట్ రిజర్వ్ డే గురించి ఇవి మీకు తెలుసా

వరల్డ్ ఛాంపియన్ టెస్టులో భాగంగా ఇండియా.. న్యూజిలాండ్ ల మధ్య ఆరో రోజు మ్యాచ్ కొనసాగుతుంది. మొదటి రోజు, నాలుగో రోజు వర్షం కారణంగా, లైట్ లోపంతో మ్యాచ్ పూర్తిగా రద్దు కావడంతో మ్యాచ్ రద్దు అయింది.

WTC Final: ఛాంపియన్ టెస్ట్ రిజర్వ్ డే గురించి ఇవి మీకు తెలుసా

Rserve Day

WTC Final: వరల్డ్ ఛాంపియన్ టెస్టులో భాగంగా ఇండియా.. న్యూజిలాండ్ ల మధ్య ఆరో రోజు మ్యాచ్ కొనసాగుతుంది. మొదటి రోజు, నాలుగో రోజు వర్షం కారణంగా, లైట్ లోపంతో మ్యాచ్ పూర్తిగా రద్దు కావడంతో మ్యాచ్ రద్దు అయింది.

ఈ మేరకు ఐసీసీ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2021 ఫైనల్ కు రిజర్వ్ డే వాడుకుంటున్నామంటూ కామెంట్ చేసింది. ఐదు రోజుల్లో ఏదైనా కారణంతో ఒక రోజు మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డేను వాడుకోవచ్చు.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2018లో దీని పట్ల నిర్ణయం తీసుకున్నారు. ఇక రిజర్వ్ డే మ్యాచ్ లో మొత్తం 98ఓవర్లు ఆడనుండా ఉదయం 10గంటల 30 నిమిషాల నుంచి మ్యాచ్ మొదలవుతుంది. ఈ మేర ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభమవుతుందంటూ అంపైర్లు సిగ్నల్ ఇస్తారు.

ఈ రిజర్వ్ డే కోసం కనీసం 330నిమిషాలు కేటాయించినున్నట్లు ఐసీసీ స్టేట్మెంట్ లో తెలిపింది. ఏదైనా కారణంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకూ జరగకుండా ఆగిపోతే.. ఎంత సేపు అయితే టైం కోల్పోయారో అంత యాడ్ చేస్తారు. అని ఐసీసీ వెల్లడించింది.

ఈ రూల్స్ తో పాటు కొవిడ్ 19 నిబంధనలను, లిమిటేషన్స్ ను రిజర్వ్ డే రోజు కూడా పాటిస్తున్నారు అంతేకాకుండా మ్యాచ్ టిక్కెట్లను రాయితీ ధరలకే విక్రయించింది స్టేడియం మేనేజ్మెంట్.

ఐదో రోజు ఆటను న్యూజిలాండ్ 32పరుగుల ఆధిక్యంతో ముగించింది. తొలి ఇన్సింగ్స్ లో ఇండియా టాస్ గెలిచి 217పరుగులు చేసింది.