ఒక్క మ్యాచ్ ఓడితే దారి మూసుకుపోయినట్లు కాదు: చాహల్
ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ సీజన్ 12లో ఏడో విజయాన్ని నెత్తినేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.

ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ సీజన్ 12లో ఏడో విజయాన్ని నెత్తినేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ సీజన్ 12లో ఏడో విజయాన్ని నెత్తినేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. మరోసారి కెప్టెన్సీలో జరిగిన పొరబాట్ల కారణంగా చేతికి అందిన విజయాన్ని జారవిడుచుకుంది. తమకు మిగిలిన పరాభవం పట్ల తామేమీ చింతించడం లేదని ఇంకా దారులు మూసుకుపోలేదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ చాహల్ చెప్పుకొస్తున్నాడు.
‘తర్వాతి ఆరు మ్యాచ్‌లు గెలిచినా మేం ప్లే ఆఫ్‌లకు అర్హత సాధిస్తాం. గత సీజన్‌లో ఓ జట్టు 14పాయింట్లతోనే ప్లే ఆఫ్‌కు చేరుకుంది. అందుకని దారులు ఇంకా మూసుకుపోలేదు. తర్వాత జరిగేదేంటో మీకెవ్వరికీ తెలియదు’ అని మ్యాచ్ ఓటమి పట్ల తీవ్ర నిరాశకు గురైన చాహల్ మీడియా సమావేశంలో తెలిపాడు.
‘మైదానాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. స్పిన్ బౌలింగ్ ఎదుర్కొని పరుగులు చేయడం అంత తేలికేం కాదు. 18 ఓవర్ల వరకూ నేను సరిగానే బౌలింగ్ చేశానని అనుకుంటున్నా. మిగిలిన 2 ఓవర్లే మ్యాచ్‌ను ఘోరంగా తిప్పేశాయి. 2 ఓవర్లలో 22పరుగులు రావడం కష్టమని భావించాం. కానీ, హార్దిక్ పాండ్యా అది చేసి చూపించాడు. ఈ ఓటమి పట్ల ఏ ఒక్క బౌలర్‌నో నిందించడం సరికాదు. ఇది పూర్తి జట్టు ఫలితం’ అని చాహల్ చెప్పుకొచ్చాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన తర్వాతి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 19 శుక్రవారం ఆడనుంది. సీజన్‌లో నిలబడాలంటే ఆర్సీబీకి ప్రతి మ్యాచ్ కీలకమే.
Read Also : ముంబై ఇండియన్స్ నుంచి తప్పుకున్న యువ బౌలర్