Samsung Galaxy Phones : తగ్గేదేలే.. ఆపిల్‌కు పోటీగా శాంసంగ్.. ఐఫోన్ల తర్వాత గెలాక్సీ ఫోన్లలోనూ శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్..!
Samsung Galaxy Phones : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేశాయి. కొత్త ఐఫోన్ 14 ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్‌కు పోటీగా సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కూడా కొత్త గెలాక్సీ ఫోన్లను లాంచ్ చేయనుంది.

After iPhones, Samsung Galaxy phones may get satellite connectivity feature
Samsung Galaxy Phones : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ గ్లోబల్ మార్కెట్లోకి వచ్చేశాయి. కొత్త ఐఫోన్ 14 ఫోన్లలో శాటిలైట్ కనెక్టవిటీ ఫీచర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్‌కు పోటీగా సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కూడా కొత్త గెలాక్సీ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ గెలాక్సీ ఫోన్లలో ప్రధానంగా శాటిలైట్ కనెక్టవిటీ ఫీచర్ ఉండనున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఈ ఫీచర్‌ను ఏ శాంసంగ్ ఫోన్లకు అందుబాటులోకి రానుంది.. ఏ దేశాలలో అందుబాటులో ఉండనున్నాయి అనేది రివీల్ చేయలేదు.
కానీ, ఇప్పటికే అమెరికా, కెనడాలో మాత్రమే ఐఫోన్ 14 సిరీస్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను ఆపిల్ అందిస్తోంది. భారత్ వంటి దేశాల్లో ఈ శాటిలైట్ కనెక్టివిటీ ఆప్షన్ సాధారణ యూజర్లకు అందుబాటులో లేదు. కొత్త iPhone 14 మోడల్‌లలో మాత్రమే ఆపిల్ ప్రవేశపెట్టింది. iPhone 14, 14 Plus, 14 Pro, 14 Pro Max వంటి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. సూపర్-ప్రీమియం ఆపిల్ వాచ్ అల్ట్రా (Apple Watch Ultra)లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్ యూజర్లకు సెల్యులార్, Wi-Fi కవరేజ్ లేనప్పుడు ఎమర్జెన్సీ సర్వీస్‌లను మెసేజ్ చేసేందుకు శాటిలైట్ ద్వారా ఎమర్జెన్సీ SOSని అనుమతిస్తుంది.

After iPhones, Samsung Galaxy phones may get satellite connectivity feature
Samsung అత్యంత ప్రీమియం Galaxy S-సిరీస్, ఫోల్డ్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో కనీసం మొదటి దశలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అమెరికా, కెనడా కాకుండా ఇతర మార్కెట్లలో కంపెనీ ఈ ఆప్షన్ ప్రవేశపెడుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కోసం కొత్త ఫీచర్లపై ఆపిల్ సూట్ (Apple Suite)ను ఫాలో చేయడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీ ఇంటర్నల్ TWS ఇయర్‌బడ్‌ల సేల్స్ పెంచడానికి హెడ్‌ఫోన్‌ల జాక్‌ను తొలగిస్తోంది. ఆపిల్ ప్రధాన మోడల్ ఐఫోన్ 7 సిరీస్‌లో ఈ ఫీచర్ మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆపిల్ కొత్త ఐఫోన్ 14 స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ కౌంటర్‌పార్ట్‌ల నుంచి కొన్ని ఫీచర్లను కూడా తీసుకురానుంది. కంపెనీ iPhone 14 Pro, 14 Pro Maxలో AoD (ఎల్లప్పుడూ డిస్‌ప్లేలో ఉంటుంది)ను ప్రవేశపెట్టింది. కానీ, చాలా ఏళ్లుగా చాలా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. శాంసంగ్ 2016లో Galaxy S7 ఎడ్జ్‌తో తీసుకువచ్చింది. అదేవిధంగా, iPhone 14లో మాదిరిగా Samsung ఫ్లాగ్‌షిప్‌లో సూపర్ స్టెడీ మోడ్ కూడా తీసుకొచ్చింది.