John McAfee Death : జాన్ మెకాఫీ మృతి.. అతడి చేతిపై టాటూ వైరల్..
పాపులర్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ క్రియేటర్ జాన్ మెకాఫీ (75) స్పెయిన్‌లోని బార్సిలోనా జైలులో అనుమానాస్పదంగా మృతిచెందాడు. మెకాఫీ మృతిచెందిన కొన్ని గంటల తర్వాత ఒకప్పుడు ఆయన పాత ట్వీట్ ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

After John Mcafee's Death, His Old Tweet With 'whackd' Tattoo Goes Viral
John McAfee’s Death WHACKD’ tattoo : పాపులర్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ క్రియేటర్ జాన్ మెకాఫీ (75) స్పెయిన్‌లోని బార్సిలోనా జైలులో అనుమానాస్పదంగా మృతిచెందాడు. మెకాఫీ మృతిచెందిన కొన్ని గంటల తర్వాత ఒకప్పుడు ఆయన పాత ట్వీట్ ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. 2019లో మెకాఫీ నుంచి ఈ ట్వీట్ పోస్టు చేశారు. అందులో అతడి కుడి చేతి బైసెప్ (కండలపై) $WHACKD అనే పేరుతో ఒక టాటూ ఉంది. ఇప్పుడా ఆ టాటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
జైలు డాక్టర్లు మెకాఫీని కాపాడేందకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. అయితే మెకాఫీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మెకాఫీ 2014 మరియు 2015 సంవత్సరాలకు గాను పన్నులు చెల్లించలేదు. గత ఏడాది అక్టోబర్‌లో మెకాఫీని అరెస్టు చేశారు. ఆ కేసుకు సంబంధించి బార్సిలోనా జైలులో మెకాఫీ శిక్షను అనుభవిస్తున్నాడు. పన్ను ఎగవేత కేసులో భాగంగా ఆయనను అమెరికాకు అప్పగించాలని స్పానిష్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్పెయిన్ కోర్టు ఆమోదించిన తరుణంలో ఈ ఘటన జరిగింది.
టెక్నాలజీ రంగంలో తొలిసారి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను రిలీజ్ చేసింది. అతి తక్కువ సమయంలో మెకాఫీ వైరస్ స్కాన్ బిలియన్ డాలర్ల ఇండస్ట్రీగా మారింది. ఇంటెల్‌కు 7.6 బిలియన్ల డాలర్లకు అమ్మేశాడు. జాన్ 2010లో మెకాఫీ సంస్థలను ఇంటెల్‌కు విక్రయించాడు. మార్చిలో, క్రిప్టోకరెన్సీలను ప్రోత్సహించడానికి సోషల్ మీడియాను ఉపయోగించినందుకు అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.