Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. అతి చౌకైన ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా బెనిఫిట్స్..!
Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1GB డేటా, 300 SMS పొందవచ్చు.

Airtel Prepaid Plans
Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎయిర్‌టెల్ మరో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. BSNL, రిలయన్స్ జియోతో పోటీగా ఎయిర్‌టెల్ (Airtel Prepaid Plans) రూ.189 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మాత్రమే కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
ఈ కొత్త ప్లాన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్, యాప్ ద్వారా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. రూ. 200 రూపాయల కన్నా తక్కువ ధరలో బేసిక్, తక్కువ వ్యాలిడిటీ ప్లాన్ కోరుకునే యూజర్ల కోసం ఈ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది.
ప్రత్యేకించి డేటా ప్లాన్ అవసరం ఉండదు. ఎయిర్‌టెల్ అందించే రీఛార్జ్ ప్లాన్లలో రూ. 189 ప్లాన్, రూ. 199 ప్లాన్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ ప్లాన్ బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Read Also : Samsung Galaxy S24 5G : శాంసంగ్ లవర్స్ కోసం కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇలా కొంటే.. ఈ 5G ఫోన్ అతి తక్కువ ధరకే..!
ఎయిర్‌టెల్ రూ.189 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.189 ప్లాన్‌లో 21 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1GB మొబైల్ డేటా, మొత్తం 300 SMS పొందవచ్చు. ఈ ప్లాన్ భారీ డేటా యూజర్లకు లేదా స్ట్రీమర్‌లకు సరిపోదు. కానీ, ఎక్కువ కాలింగ్, అప్పుడప్పుడు మెసేజింగ్ కోసం డేటాను వాడేవారికి బెస్ట్ ప్లాన్. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటాను మాత్రమే పొందవచ్చు. రెగ్యులర్ బ్రౌజింగ్ లేదా వీడియోల కోసం స్పెషల్ టాప్-అప్ డేటా ప్యాక్ తీసుకోవాలి.
రెండు రీఛార్జ్ ప్లాన్లు.. ఏ ప్లాన్ బెటర్? :
ఎయిర్‌టెల్ రూ.200 లోపు రెండు రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ.189 ప్లాన్, మరొకటి రూ.199 ప్లాన్.. ఈ రెండో ప్లాన్ కోసం రూ. 10 ఎక్కువ ఖర్చు చేస్తే 28 రోజుల వ్యాలిడిటీతో పాటు మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.