Airtel Festive Plans : ఎయిర్‌టెల్ పండుగ ఆఫర్లు.. 3 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..!

Airtel Festive Plans : ఎయిర్‌టెల్ పండుగ ఆఫర్‌లతో మొత్తం 3 ప్లాన్‌లను లాంచ్ చేసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 979 కొనుగోలుపై 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియంపై 22+ ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తుంది.

Airtel Festive Plans : ఎయిర్‌టెల్ పండుగ ఆఫర్లు.. 3 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..!

Airtel launches 3 new festive prepaid plans, here are the details ( Image Source : Google )

Airtel Festive Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం ప్రత్యేకమైన పండుగ ఆఫర్లను ప్రకటించింది. మొత్తం 3 ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పండుగ ఆఫర్‌లలో భాగంగా ఎయిర్‌టెల్ ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసులు, మరిన్నింటితో సహా కొన్ని అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : Jio PhoneCall AI : జియో ఫోన్‌కాల్ ఏఐ అంటే ఏంటి? ఇదేలా పనిచేస్తుంది? ఎప్పుడు వస్తుంది?

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు :
ఎయిర్‌టెల్ పండుగ ఆఫర్‌లతో మొత్తం 3 ప్లాన్‌లను లాంచ్ చేసింది. లేటెస్ట్ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 979 కొనుగోలుపై 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియంపై 22+ ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. టెలికాం దిగ్గజం అదనంగా 10జీబీ డేటా కూపన్‌ను కూడా ఇస్తోంది. 28 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది.

ఎయిర్‌టెల్ నుంచి రూ. 1,029 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అందిస్తుంది. ఇందులో 2జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. ఈ ప్యాక్‌తో మీరు ఎక్స్‌ట్రీమ్ ప్రీమియంపై 22 ప్లస్ ఓటీటీ, 28 రోజులు మాత్రమే వ్యాలిడిటీ అందిస్తుంది. 10జీబీ డేటా కూపన్ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.

రూ. 3,599 విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. ఈ దీర్ఘకాలిక ప్లాన్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియంపై 22 ప్లస్ ఓటీటీ, 28 రోజుల వ్యాలిడిటీతో 10జీబీ డేటా కూపన్‌ను కూడా అందిస్తుంది. ఈ కొత్త ప్రత్యేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లు కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఎయిర్‌టెల్ ధృవీకరించింది. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 11 నుంచి 6 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 979, రూ. 1029, రూ. 3599 అనే 3 క్యూరేటెడ్ ప్యాక్‌లపై పరిమిత కాలపు పండుగ ఆఫర్ అందిస్తోంది.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం.. సబ్‌స్క్రైబర్‌ల కోసం స్పెషల్ ప్లాన్లు, ఓటీటీ బెనిఫిట్స్ ఇవే!