Android 13 Final Beta : గూగుల్ ఆండ్రాయిడ్ 13 ఫైనల్ బీటా రిలీజ్.. స్టేబుల్ అప్‌డేట్ ఎప్పుడంటే?
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఫైనల్ బీటా వెర్షన్ రిలీజ్ చేసింది. అతి త్వరలో స్టేబుల్ అప్‌డేట్ రిలీజ్ చేయనుంది. పిక్సెల్ ఫోన్‌లలో స్టేబుల్ అప్‌డేట్ రాబోయే కొద్ది నెలల్లో లాంచ్ కానుంది.

Android 13 Final Beta Released, Stable Update To Roll Out Soon
Android 13 Final Beta : ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఫైనల్ బీటా వెర్షన్ రిలీజ్ చేసింది. అతి త్వరలో స్టేబుల్ అప్‌డేట్ రిలీజ్ చేయనుంది. పిక్సెల్ ఫోన్‌లలో స్టేబుల్ అప్‌డేట్ రాబోయే కొద్ది నెలల్లో లాంచ్ కానుంది. యాప్ డెవలపర్‌లు ఇప్పుడు ఫైనల్ టెస్టు పూర్తి చేయనుంది. ఫైనల్ రిలీజ్‌కు ముందే సపోర్టు compatibility అప్‌డేట్‌లను అందించనుందని Google పేర్కొంది. గూగుల్ ఆండ్రాయిడ్ 12ను అక్టోబర్ 2021లో విడుదల చేసింది. గతంలో ఆండ్రాయిడ్ 11 సెప్టెంబర్ 2020లో రిలీజ్ అయింది. Compatibility Pixel డివైజ్‌లను కలిగిన యూజర్లు ఫైనల్ Android 13 బీటా (Beta 4)ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసుకోవచ్చు.
అందుకు Google డెవలపర్ సైట్‌కి వెళ్లవచ్చు. ఫీచర్ల పరంగా.. ప్రస్తుత అప్‌డేట్‌లో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు. ఆండ్రాయిడ్ 13లో కొత్త నోటిఫికేషన్ పర్మిషన్, ఫొటో పికర్ వంటి ప్రైవసీ ఫీచర్లు చాలా ఉన్నాయని Google చెబుతోంది. ఫీచర్ల పరంగా చూస్తే.. యాప్ ఐకాన్లు, ప్రతి-యాప్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉన్నాయి. USB ద్వారా HDR వీడియో, బ్లూటూత్ LE ఆడియో, MIDI 2.0 వంటి ఆధునిక అప్‌డేట్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ టాబ్లెట్ యూజర్లు వచ్చే కొత్త అప్‌డేట్ అనేక బెనిటఫిట్స్ పొందవచ్చు. ఆండ్రాయిడ్ 12Lలో అప్‌డేట్‌లను పొడిగించినట్లు కంపెనీ చెబుతోంది. యూజర్లకు టాబ్లెట్, పెద్ద స్క్రీన్ డివైజ్ బెనిఫిట్స్ పొందడానికి మెరుగైన టూల్స్ అందిస్తోంది.

Android 13 Final Beta Released, Stable Update To Roll Out Soon
Apple iOS 16 పబ్లిక్ బీటా టెస్టర్ రిలీజ్ అయిన కొద్ది రోజులకే Google లేటెస్ట్ డెవలప్‌మెంట్ వచ్చింది . Apple బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్‌కు సైన్ అప్ అయ్యే యూజర్లు Next iPhoneల అధికారిక లాంచ్ తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో లాంచ్ ముందు కొత్త iOS 16 ఫీచర్‌లను చెక్ చేయవచ్చు. ఫీచర్ల పరంగా.. యూజర్లు కొత్త లాక్ స్క్రీన్, మెసేజ్ ఫీచర్లు, ప్రైవసీ టూల్స్ కూడా చెక్ చేయవచ్చు. కంపెనీ పబ్లిక్ టెస్టర్‌లకు iPadOS 16 బీటాను రిలీజ్ చేస్తోంది. మొబైల్ లేదా PC సాఫ్ట్‌వేర్ స్టార్టప్‌లో బగ్స్ ఉన్నాయని Android, iOS బీటా టెస్టర్‌లు తప్పనిసరిగా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది.
Read Also : Android 13 beta : మీ ఫోన్లో ఆండ్రాయిడ్ 13 బీటా అప్‌డేట్ చేయండిలా..!