Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డిస్కౌంట్.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
Apple iPhone 15 Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై డిస్కౌంట్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్‌ను ఎందుకు మిస్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Apple iPhone 15 available ( Image Credit : Google )
Apple iPhone 15 Sale : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కు మారాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఇదే సరైన అవకాశం. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డీల్ అందిస్తోంది. ఈ కొత్త జనరేషన్ ఐఫోన్ 15 సిరీస్ రూ.70,999 తగ్గింపు ధరకు అందిస్తోంది. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ యూజర్లు కేవలం రూ. 66,999కి ఐఫోన్ 15 సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 15 కొనుగోలు చేయడానికి ఈ స్పెషల్ ఆఫర్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై డిస్కౌంట్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్‌ను ఎందుకు మిస్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 15పై భారీ తగ్గింపు :
ఇప్పుడు ఐఫోన్ 15 రూ.70,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. అయితే, అదనపు బ్యాంక్ ఆఫర్‌లతో వినియోగదారులు ఈ ఐఫోన్ రూ. 66,999 కన్నా ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి ఈ ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900 ఉండగా తగ్గింపు ధరతో రూ. 12,901 సేవ్ అవుతుంది. అంతేకాదు.. ఎస్బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ. 4వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఫైనల్‌గా ఐఫోన్ 15 ధర రూ. 66,999కి తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత ఫోన్ వేరియంట్, కండిషన్ ఆధారంగా రూ. 53వేల వరకు ఎక్స్ఛేంజ్ డీల్‌ను కూడా అందిస్తోంది. ఈ కొత్త సిరీస్‌లో ఎంట్రీ-లెవల్ ఫోన్ హై-ఎండ్ మోడల్‌లో ట్రేడింగ్ అవుతుంది. పాత ఐఫోన్ 13 కొనుగోలు చేసే వినియోగదారులు దాదాపు రూ. 29వేల వరకు ఖర్చు చేయవచ్చు. ఐఫోన్ 15కి అప్‌గ్రేడ్ చేసేందుకు ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.
ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి. ఫ్లిప్‌కార్ట్ త్వరలో ఈ నిబంధనలను మార్చే అవకాశ ఉందని గుర్తుంచుకోండి. మీరు ఐఫోన్ 15ని కొనుగోలు చేయాలని భావిస్తే వెంటనే కొనేసుకోవడం బెటర్. ఐఫోన్ 15 కొనుగోలుకు లాంగ్ లైఫ్ బ్యాటరీ లైఫ్ ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఐఫోన్ 15 రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. తరచుగా రీఛార్జ్‌లు అవసరం లేకుండా రోజంతా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. వర్క్, ఎంటర్‌టైన్మెంట్, ప్రయాణంలో కనెక్ట్‌గా ఉండేందుకు తమ ఫోన్‌లపై ఆధారపడే యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.