Apple Glowtime Event : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..!

Apple Glowtime Event : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ డివైజ్‌లను అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ప్రకటించింది. ఈ కొత్త డివైజ్‌లు అత్యంత ఆకర్షణీయంగా మరెన్నో అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ అయ్యాయి.

Apple Glowtime Event : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..!

Apple New Watch Ultra 2, AirPods 4 launched_ Price, specification And More ( Image Source : Google )

Apple Glowtime Event : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ప్రతిష్టాత్మకమైన గ్లోటైమ్ బిగ్ ఈవెంట్ సందర్భంగా అనేక కొత్త ఆపిల్ ప్రొడక్టులను లాంచ్ చేసింది. అందులో ప్రధానంగా ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్ పాడ్స్ వంటి డివైజ్‌లను అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ప్రకటించింది. ఈ కొత్త డివైజ్‌లు అత్యంత ఆకర్షణీయంగా మరెన్నో అప్‌గ్రేడ్స్‌తో లాంచ్ అయ్యాయి. ఇందులో అనేక రకాల అప్‌గ్రేడ్స్, యూజర్ ఎక్స్ పీరియన్స్ మరింత మెరుగుపర్చేలా కొత్త ఫీచర్‌లు ఉన్నాయి. ఈ కొత్త జనరేషన్ ఆపిల్ వాచీలు, ఎయిర్‌పాడ్‌ల గురించి వివరంగా పరిశీలిద్దాం.

Read Also : iPhone 16 Pro Price : ఆపిల్ బిగ్ ఈవెంట్‌కు ముందే లేటెస్ట్ ఐఫోన్ 16 ప్రో ధర వివరాలు లీక్..!

ఆపిల్ వాచ్ అల్ట్రా 2 స్పెషిఫికేషన్లు :
ఆపిల్ కొత్త జనరేషన్ అల్ట్రా వాచ్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త ఆపిల్ వాచ్ అల్ట్రా 2 అత్యంత మన్నికమైన పర్ఫార్మెన్స్ కోసం రూపొందించింది. ఇందులో స్ట్రాంగ్ టైటానియం కేస్, స్క్రాచ్-రెసిస్టెంట్ సపైర్ ఫ్రంట్ క్రిస్టల్ ఉన్నాయి. వాచ్ అల్ట్రా 2లో డ్యూయల్-ఫ్రీక్వెన్సీ జీపీఎస్, అడ్వాన్స్‌డ్ పొజిషనింగ్ సాఫ్ట్‌వేర్ ఉన్నాయి. ఏ స్పోర్ట్స్ వాచ్‌లో అయినా యూజర్లకు మెరుగైన జీపీఎస్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

అల్ట్రా 2 కొలమానాలు, వ్యూ, రన్నర్‌లు, సైక్లిస్ట్‌లు, స్విమ్మర్‌ల కోసం కస్టమైజడ్ వర్కౌట్‌లతో అథ్లెటిక్ కార్యకలాపాలకు సపోర్టు ఇస్తుంది. వాచ్ ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్, ల్యాప్ కౌంట్‌లు, కొత్త ట్రైనింగ్ లోడ్ వంటి ఫీచర్‌లను కూడా అందిస్తుంది. అంతేకాదు.. యాక్షన్ బటన్ ద్వారా లాంగ్ బ్యాటరీ లైఫ్ వంటి కచ్చితమైన వర్కౌట్ కంట్రోలింగ్ అవసరమయ్యే అథ్లెట్‌లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Apple New Watch Ultra 2, AirPods 4 launched_ Price, specification And More

Apple New Watch Ultra 2, AirPods 4 launched

అల్ట్రా 2 డైవింగ్ డెప్త్ గేజ్, కస్టమ్ రూట్ క్రియేషన్‌తో ఆఫ్‌లైన్ మ్యాప్‌లు, సాహసికుల కోసం హైకర్ల కోసం టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి సామర్థ్యాలతో కూడా వస్తుంది. ఇది అక్షాంశం, రేఖాంశం, వే పాయింట్ నావిగేషన్ వంటి ముఖ్యమైన డేటాతో కూడిన అడ్వాన్స్‌డ్ కంపాస్ యాప్‌ను కలిగి ఉంది. రోజువారీ పర్యటనలకు లేదా ఎక్స్‌టెండేడ్ ట్రెక్‌లకు సరైనది. నీటి కార్యకలాపాలకు అల్ట్రా 2 డెప్త్ సెన్సార్, ఆటోమేటిక్ స్ట్రోక్ డిటెక్షన్, ల్యాప్ కౌంట్ ఫీచర్‌లతో స్విమ్ వర్కౌట్‌ల ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది.

ఆపిల్ కొత్త అల్ట్రా 2 మోడల్ కొత్త శాటిన్ బ్లాక్ ఫినిషింగ్‌లో తీసుకొచ్చింది. మెరుగైన స్క్రాచ్ రెసిస్టెన్స్ కోసం డైమండ్ లాంటి కార్బన్ పీవీడీ కోటింగ్‌తో కస్టమ్ బ్లాస్టింగ్ ప్రక్రియ ద్వారా ఆపిల్ హైలైట్ చేసింది. సాధారణంగా ఏరోస్పేస్ పరిశ్రమలో ఉపయోగించే 95 శాతం రీసైకిల్ చేసిన గ్రేడ్ 5 టైటానియం నుంచి రూపొందించింది. ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ఈ డిజైన్‌తో పాటుగా కొత్త టైటానియం మిలనీస్ లూప్‌తో సహా అప్‌డేట్ చేసిన బ్యాండ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. తుప్పు పట్టకుండా ఉండేలా ఆకర్షణీయమైన డిజైన్‌తో నేచురల్ బ్లాక్ ఎండ్‌తో అందుబాటులో ఉంటుంది.

ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ధరలివే :
ఆపిల్ వాచ్ సిరీస్ 10 అమెరికాలో జీపీఎస్ మోడల్‌కు 399 డాలర్లు, జీపీఎస్+ సెల్యులార్ మోడల్‌కు 499 డాలర్ల ధరతో లాంచ్ అయింది. మరోవైపు ప్రీమియం ఆపిల్ వాచ్ అల్ట్రా 2 మోడల్ 799 డాలర్ల ధరతో లాంచ్ అయింది. సెప్టెంబర్ 20 నుంచి అమెరికాలో లభ్యమయ్యే ప్రీ-ఆర్డర్‌లకు ఈ రెండు మోడల్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Apple New Watch Ultra 2, AirPods 4 launched_ Price, specification And More

Apple New Watch Ultra 2, AirPods 4 launched

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 స్పెషిఫికేషన్లు :
ఆపిల్ ఎయిర్‌పాడ్స్ 4 మొత్తం రెండు మోడళ్లను ప్రవేశపెట్టింది. 3డీ ఫొటోగ్రామెట్రీ, లేజర్ టోపోగ్రఫీ వంటి అడ్వాన్స్‌డ్ మోడలింగ్ టూల్స్ ఉపయోగించి ఫిట్, సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి కొత్త జెన్ ఎయిర్‌పాడ్స్ రియల్ డిజైన్‌తో వచ్చాయి. హెచ్2 చిప్‌తో ఆధారితమైన కొత్త జెన్ ఎయిర్‌పాడ్‌లు ఓపెన్-ఎయిర్ డిజైన్‌లో రిచ్ బాస్, క్లియర్ హైస్‌తో మెరుగైన ఆడియో క్వాలిటీని అందిస్తాయి.

Apple New Watch Ultra 2, AirPods 4 launched_ Price, specification And More

Apple New Watch Ultra 2, AirPods 4 launched

ఎయిర్‌పాడ్స్ 4 మోడల్స్ ధర ఎంతంటే? : 
ఎయిర్‌పాడ్స్ 4 పర్సనలైజడ్ స్పేషియల్ ఆడియో, హ్యాండ్స్-ఫ్రీ కాలింగ్, గెచర్-ఆధారిత సిరితో కాల్స్ చేసేందుకు వాయిస్ ఐసోలేషన్‌ను కలిగి ఉంది. కొత్త ఎయిర్‌పాడ్స్ 4 ఛార్జింగ్ కేస్ కాంపాక్ట్, యూఎస్‌బీ-సికి సపోర్టు ఇస్తుంది. మొత్తం 30 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అడ్వాన్స్‌డ్ పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్ల విషయానికొస్తే.. ఆపిల్ ఎయిర్‌ప్లేన్ ఇంజిన్‌లు, సిటీ ట్రాఫిక్ వంటి సౌండ్ పొల్యుషన్ తగ్గించడానికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అప్‌గ్రేడ్ మైక్రోఫోన్‌లు, హెచ్2 చిప్, కంప్యూటేషనల్ ఆడియోతో కూడిన ఎయిర్‌పాడ్స్ 4 మొత్తం రెండు మోడల్స్ ప్రవేశపెట్టింది. ఎయిర్ పాడ్స్ ధరలు వరుసగా 129 డాలర్లు, యాక్టివ్ నాయిజ్ క్యాన్సిలేషన్ ఎయిర్ పాడ్స్ 4 ధర 179 డాలర్ల నుంచి అందుబాటులో ఉంటాయి.

Apple New Watch Ultra 2, AirPods 4 launched_ Price, specification And More

Apple New Watch Ultra 2, AirPods 4 launched

ఈ ఎయిర్‌పాడ్‌లు ట్రాన్స్‌పరెంట్ మోడ్, అడాప్టివ్ ఆడియో, మీడియా వాల్యూమ్‌ కంట్రోలింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ కేస్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ వాచ్, క్యూఐ-సర్టిఫైడ్ ఛార్జర్‌లకు సపోర్టు, “ఫైండ్ మై” ఫంక్షనాలిటీకి ఇంటర్నల్ స్పీకర్ కూడా ఉన్నాయి. ఎయిర్‌పాడ్స్ 4 రెండు మోడల్‌లు 100 శాతం ఫైబర్ ఆధారిత పదార్థాల ప్యాకేజింగ్‌‌తో 30 శాతానికి పైగా తగ్గించి 2030 నాటికి ఆపిల్ కార్బన్ న్యూట్రాలిటీని సాధించడమే లక్ష్యమని ఆపిల్ చెబుతోంది.

Read Also : Apple Watch Series 10 : భారీ డిస్‌ప్లే, న్యూ డిజైన్‌తో ఆపిల్ వాచ్ సిరీస్ 10 వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?