ట్రిపుల్ కెమెరా ఫీచర్లు : ఈ ఏడాదిలో మూడు కొత్త ఐఫోన్లు

2019 కొత్త ఏడాదిలో ఐఫోన్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్. మరో మూడు సరికొత్త మోడల్ ఐఫోన్లు వచ్చేస్తున్నాయి. ఆపిల్ మొబైల్ తయారీ సంస్థ న్యూ మోడల్ ఐఫోన్లను త్వరలో మార్కెట్లలో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : January 11, 2019 / 12:47 PM IST
ట్రిపుల్ కెమెరా ఫీచర్లు : ఈ ఏడాదిలో మూడు కొత్త ఐఫోన్లు

2019 కొత్త ఏడాదిలో ఐఫోన్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్. మరో మూడు సరికొత్త మోడల్ ఐఫోన్లు వచ్చేస్తున్నాయి. ఆపిల్ మొబైల్ తయారీ సంస్థ న్యూ మోడల్ ఐఫోన్లను త్వరలో మార్కెట్లలో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.

2019 కొత్త ఏడాదిలో ఐఫోన్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్. మరో మూడు సరికొత్త మోడల్ ఐఫోన్లు వచ్చేస్తున్నాయి. ఆపిల్ మొబైల్ తయారీ సంస్థ న్యూ మోడల్ ఐఫోన్లను త్వరలో మార్కెట్లలో ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే  ఇప్పటివరకూ ఐఫోన్ XS, ఐఫోన్ XS MAX, ఐఫోన్ XR లాంటి ఎన్నో మోడల్స్ తో యూజర్లను ఆకర్షించిన యాపిల్ మొబైల్ తయారీ సంస్థ.. మరో మోడ్రాన్ ఐఫోన్ (నెక్ట్స్ జనరేషన్) ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ కొత్త సర్వీసులను ఈ ఏడాదిలో విడుదల చేయనున్నట్టు ఆపిల్ కంపెనీ సీఈఓ  టిమ్ కూక్ వెల్లడించారు.

2018లో ఐఫోన్ సేల్స్ డీలా..
2018లో చైనా సహా ఇతర దేశాల మార్కెట్లలో ఐఫోన్ అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో ఆపిల్ కంపెనీ ట్రబుల్స్ లో పడింది. అప్పటి నుంచి పడిపోయిన ఐఫోన్ సేల్స్ ను తిరిగి నిలబట్టే దిశగా ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా మూడు సరికొత్త టెక్నాలజీ ఐఫోన్ మోడల్స్ ను ప్రవేశపెట్టనుంది. అవే.. ఐఫోన్ XR, ఐఫోన్ XS, ఐఫోన్ X MAX సక్సెసర్. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది. క్యూపర్టినో ఆధారిత సంస్థ ఆపిల్ కొత్త కెమెరా ఫీచర్లతో కూడిన మూడు ఐఫోన్లను అందుబాటులోకి తేనున్నట్టు నివేదిక పేర్కొంది. ఐఫోన్ ఎక్స్ మ్యాక్స్ సక్సెసర్ మోడల్లో ట్రిపుల్ కెమెరాలను పరిచయం చేయాలని యోచిస్తున్నట్టు తెలిపింది. 

కొత్త ఐఫోన్ ఫీచర్లపైనే ఫోకస్..
వాల్ స్ట్రీట్ జనరల్ (డబ్ల్యుఎస్జే) నివేదిక ప్రకారం.. 2019లో కూడా ఐఫోన్ మూడు ఐఫోన్ మోడల్స్ ను విడుదల చేయనుంది. 2018 మోడల్స్ కు ఫాలోప్ గా ఈ మూడు కొత్త ఐఫోన్లను ప్రవేశపెట్టనుంది. అయితే వచ్చే ఈ మూడు ఐఫోన్ల ఫీచర్లు ఎలా ఉంటాయనేది మిస్టరీగా ఉంచింది. కానీ, డబ్ల్యుఎస్జే మాత్రం వచ్చే ఐఫోన్లలో ఒక ఐఫోన్ లో మాత్రం ట్రిపుల్ కెమెరా ఫీచర్ ఉంటుందని హింట్ ఇచ్చింది. మిగతా రెండు ఐఫోన్లలో ఐఫోన్ ఎక్స్ఎస్ మోడల్ తరహాలో వెనుక రెండు కెమెరాలు ఉంటాయని పేర్కొంది. ఇక ఐఫోన్ ఎక్స్ఆర్ (రూ.72,190) మోడల్ మాత్రం కెమెరా ఫీచర్ మారుతుందని తెలిపింది. 

2020లో ఐఫోన్లలో ఆ డిజైన్ ఉండదట..
గతంలో విడుదలైన ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్ కు సింగల్ కెమెరా మాత్రమే ఉంది. ఐఫోన్ ఎక్స్ ఆర్ మోడల్ కు ఎల్ సీడీ స్ర్కీన్ ను కొనసాగించాలని భావిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. 2019లో ఐఫోన్ మోడల్స్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటాయని, ఇంకా డిజైన్ పూర్తికాలేదని తెలిపింది. ఇక 2020 ఐఫోన్ మోడల్స్ కు మాత్రం ఎల్ సీడీ స్ర్కీన్ ను మొత్తానికి తీసేసి దాని స్థానంలో ఓఎల్ ఈడీ ప్యానెల్స్ ను తీసుకురావాలని భావిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఓఎల్ ఈడీ ప్యానెల్స్ ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ మ్యాక్స్ మోడల్స్ మాత్రమే ఉన్నాయి.