BlueSky Twitter Clone : ట్విట్టర్ క్లోన్ వెర్షన్ ‘బ్లూస్కై’ ఇకపై అందరికి అందుబాటులోకి.. ఇదేంటి? ఎలా పనిచేస్తుందంటే?

BlueSky Twitter Clone : సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫారమ్ బ్లూస్కై వాస్తవానికి మాజీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే రూపొందించారు. ఇప్పుడు యూజర్లందరికి ఈ ట్విట్టర్ క్లోన్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.

BlueSky Twitter Clone : ట్విట్టర్ క్లోన్ వెర్షన్ ‘బ్లూస్కై’ ఇకపై అందరికి అందుబాటులోకి.. ఇదేంటి? ఎలా పనిచేస్తుందంటే?

BlueSky, which is Jack Dorsey’s Twitter clone

BlueSky Twitter Clone : ట్విట్టర్ గురించి అందరికి తెలుసు.. కానీ, బ్లూస్కై గురించి ఎప్పుడైనా విన్నారా? ఇదో ట్విట్టర్ క్లోన్ వెర్షన్. ఇంతకీ, జాక్ డోర్సే గురించి తెలుసా? అదేనండీ.. మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ మాజీ సీఈఓ. గతంలో ట్విట్టర్‌ ఈయన తర్వాతే మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత అగర్వాల్‌ను ట్విట్టర్ (X) ప్రస్తుత బాస్ ఎలోన్ మస్క్ తొలగించిన సంగతి అందరికి తెలిసిందే. బ్లూస్కై అనేది గతంలో ఇన్వైట్ ఓన్లీ ప్లాట్‌ఫారమ్.. అంటే.. దీన్ని యాక్సస్ చేయాలంటే యూజర్లకు ఇన్వైట్ కోడ్ అవసరం. కానీ, ఇప్పుడు ఎలాంటి కోడ్ అవసరం లేదు. ఎవరైనా సరే సులభంగా సైన్‌అప్ చేయవచ్చు. ఎవరైనా ప్లాట్‌ఫారమ్‌లో చేరవచ్చు.

అతి త్వరలో లేబులింగ్ సర్వీసు :
ఫిబ్రవరి 2022లో బ్లూస్కై ఇన్వైట్-ఓన్లీ అనే బీటా వెర్షన్‌గా ప్రారంభమైంది. కానీ, ఇప్పుడు ఈ ట్విట్టర్ క్లోన్ యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ సోషల్ నెట్‌వర్క్ ట్విట్టర్ మాదిరిగానే అన్ని ఫీచర్లను కలిగి ఉంది. ఉదాహరణకు.. ‘లేబులింగ్ సర్వీసు’ అనే ఫీచర్‌ని ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సర్వీసును వినియోగదారులతో పాటు సంస్థలను కంటెంట్‌ని మోడరేట్ చేయడానికి లేబుల్‌లను రూపొందించడానికి అనుమతిస్తుంది.

Read Also : Whatsapp Block Spam : వాట్సాప్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్.. లాక్ స్క్రీన్ నుంచే నేరుగా స్పామ్ నంబర్‌లను బ్లాక్ చేయొచ్చు!

బ్లూస్కై పోస్ట్‌లను రియల్ చెక్ చేయడం లేదా కంటెంట్‌లో మార్పులు చేసేందుకు ఈ లేబుల్‌లను ఉపయోగించవచ్చు. సోషల్ వెబ్‌సైట్లు సాధారణంగా మోడరేషన్ కోసం లేబుల్స్‌ని ఉపయోగిస్తాయని గత ఏడాదిలో బ్లూస్కై సీఈఓ జే గ్రాబెర్ ప్రస్తావించారు. అయితే బ్లూస్కై మాత్రం అందుకు భిన్నంగా చేయాలనుకుంటుందని తెలిపారు. ఏది లేబుల్ చేయాలి? ఎలా అనేదానిపై వినియోగదారులకు మరింత నియంత్రణను కలిగి ఉండేలా అనుమతిస్తుందని గ్రాబెర్ చెప్పుకొచ్చారు.

యాప్స్ మధ్య సులభంగా మారవచ్చు :
ఇటీవలే బ్లూస్కై ప్లాట్‌ఫారమ్‌ ఏటీ ప్రోటోకాల్‌ను వివరిస్తూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బ్లూస్కైలో ప్రతిదీ సక్రమంగానే కొనసాగుతుందని గుర్తించేందుకు ఈ ప్రోటోకాల్ సాయపడుతుంది. వాస్తవానికి.. బ్లూస్కై అనేది ట్విట్టర్‌లో జాక్ డోర్సే నాయకత్వంలో అద్భుతమైన ఆలోచనకు ప్రతిరూపం. 2021లో బ్లూస్కై సొంత కంపెనీగా రూపుదాల్చింది. ప్రస్తుతం ఈ కంపెనీని జే గ్రాబెర్, ఇతరుల బృందం నడుపుతోంది. ఒకరితో ఒకరు సులభంగా మాట్లాడుకోగలిగే సోషల్ యాప్‌ల నెట్‌వర్క్‌ని క్రియేట్ చేయడమే బ్లూ‌స్కై లక్ష్యం. దీనిద్వారా యూజర్లు మరింత నియంత్రణను కలిగి ఉంటారు. వివిధ యాప్‌ల మధ్య సులభంగా మారడానికి వీలు కల్పిస్తుంది.

BlueSky, which is Jack Dorsey’s Twitter clone

BlueSky, Jack Dorsey’s Twitter clone

యూజర్లకు మరింత కంట్రోలింగ్ :
బ్లూస్కైలో మరో అకౌంట్ పోర్టబిలిటీ అనేది ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. ఎందుకంటే.. వినియోగదారులు తమ డేటాను కోల్పోకుండా వివిధ ప్లాట్‌ఫారమ్‌ల మధ్య తమ అకౌంట్లను సులభంగా మారవచ్చు. ఇతర సోషల్ నెట్‌వర్క్‌ల్లో ఇలాంటి అవకాశం లేదు. బ్లూస్కైలో మరో ప్రత్యేక ఫీచర్ ‘అల్గారిథమ్‌ మార్కెట్‌ప్లేస్’.. మీరు విజిట్ చేసిన ఫీడ్ బదులుగా యూజర్లు తమ ఫీడ్‌లను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. తద్వారా మీరు వీక్షించే కంటెంట్‌పై మరింత కంట్రోల్ పొందవచ్చు.

ఎవరైనా ఈజీగా జాయిన్ కావొచ్చు :
గతంలో బ్లూస్కై ట్విట్టర్ (X)కి లింక్ అయి ఉండేది. కానీ, ఇప్పుడు, పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. అతికొద్దికాలంలోనే పాపులర్ అయింది. ట్విట్టర్ క్లోన్‌గా లాంచ్ అయినప్పటినుంచి మూడు మిలియన్ల మంది యూజర్లకు చేరుకుంది. ఇప్పటికీ ఇతర సోషల్ నెట్‌వర్క్‌ల మాదిరిగా పెద్ద‌ప్లాట్‌ఫారంగా మారలేదు. ప్రత్యేకించి ఇప్పుడు ఎవరైనా ఈ బ్లూస్కై ప్లాట్‌ఫారంలో జాయిన్ కావొచ్చు. ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌తో బోరుగా అనిపిస్తే.. ఈ బ్లూ స్కై ఓసారి ట్రై చేయొచ్చు.

Read Also : 35 సార్లు ఫెయిల్.. ఫస్ట్ ఐపీఎస్ అయ్యాడు.. ఆపై ఐఏఎస్ అధికారిగా.. సక్సెస్‌‌కు చిరునామా ఇతడే!