Best Selling Premium Hatch : భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే ప్రీమియం హాచ్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ కార్ల ధర ఎంతంటే?

Best Selling Premium Hatch : ఈ జూన్‌లో బొలెనో ఎంటీ రూ. 57,100 వరకు తగ్గింపులను కలిగి ఉండగా, బెలెనో ఏఎంటీపై రూ. 62,100 తగ్గింపు పొందవచ్చు. బెలొనో సీఎన్‌జీపై రూ.47,100 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు.

Best Selling Premium Hatch : భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే ప్రీమియం హాచ్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ కార్ల ధర ఎంతంటే?

India's best-selling premium hatch ( Image Source : Google )

Best Selling Premium Hatch : కొత్త కారు కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్పేస్‌లో హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాంజా వంటి కొన్ని టాప్ పోటీదారుల కార్లు ఉన్నాయి. అయితే, చాలా కాలంగా సెగ్మెంట్ లీడర్‌గా మారుతి సుజుకి బాలెనో అగ్రస్థానంలో ఉంది. ఈ జూన్‌లో ఈ కారు భారీ తగ్గింపులను పొందవచ్చు. మారుతి సుజుకి బాలెనో 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-వివిటీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. గరిష్టంగా 89.7Pఎస్ పవర్, 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.

Read Also : Reliance Jio Tariff Hikes : జియో యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన టారిఫ్ ధరలు.. కొత్త ప్లాన్ల వివరాలివే..!

ఇందులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. గరిష్టంగా 77.4పీఎస్ పవర్ 98.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో పెట్రోల్ యూనిట్‌తో 5-స్పీడ్ ఎంటీ, 5-స్పీడ్ ఎఎంటీ, సీఎన్‌జీ యూనిట్‌తో 5-స్పీడ్ ఎంటీ ఉన్నాయి. మారుతి సుజుకి బాలెనో మైలేజ్ పెట్రోల్ ఎంటీకి 22.35kmpl, పెట్రోల్ ఏఎంటీకి 22.94kmpl, సీఎన్‌జీ ఎంటీకి 30.61kmpl మైలేజీ అందిస్తుంది. ఈ కారు సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ వారీగా మారుతి సుజుకి బాలెనో ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

  • సిగ్మా ఎంటీ – రూ. 6.66 లక్షలు
  • డెల్టా ఎంటీ – రూ. 7.50 లక్షలు
  • డెల్టా ఏఎంటీ – రూ. 8 లక్షలు
  • డెల్టా ఎంటీ సీఎన్‌జీ – రూ. 8.40 లక్షలు
  • జీటా ఎంటీ – రూ. 8.43 లక్షలు
  • జీటా ఎఎంటీ – రూ. 8.93 లక్షలు
  • జీటా ఎంటీ సీఎన్‌జీ – రూ. 9.33 లక్షలు
  • ఆల్ఫా ఎంటీ – రూ. 9.38 లక్షలు
  • ఆల్ఫా ఎఎంటీ – రూ. 9.88 లక్షలు

జూన్‌లో బొలెనో ఎంటీ రూ. 57,100 వరకు తగ్గింపులను కలిగి ఉండగా, బెలెనో ఏఎంటీపై రూ. 62,100 తగ్గింపు పొందవచ్చు. బెలొనో సీఎన్‌జీపై రూ.47,100 వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. బాలెనో ఎఫ్‌వై24లో 195,607 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, భారత్‌లో రెండవ అతిపెద్ద అమ్ముడైన కారుగా నిలిచింది.

Read Also : Vivo T3 Lite 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? వివో టీ3 లైట్ 5జీ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?