Facebook : మెటావర్స్ వస్తోంది.. ఎప్పటి నుంచో తెలుసా ?
దూరంగా ఉన్న వాళ్లు ఒకరినొకరు వర్చువల్ గా కలుసుకోవచ్చు. వర్చువల్ గా, రియల్ టైమ్ లో ఒకరినొకరు చూస్తూ.. అన్నీ పనులు చేసుకొనే అవకాశం ఉంది. స్నేహితులు ఏదైనా టూర్ కు వెళితే.. మీరు మిస్ అయ్యారని...

Fb
Facebook Is Opening A Physical Store : ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో టెక్నాలజీ ప్రజల ముందటకొస్తోంది. ఊహించని విధంగా అత్యవంత వేగంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఇంటర్నెట్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్.. ఇతరత్రా సాధనాలు మార్పులకు కారణమయ్యాయి. ఇప్పుడు మరొక రూపకల్పన రాబోతోంది. మనుషులు పూర్తిగా వర్చువల్ ప్రపంచంలోనే గడిపేలా టెక్నాలజీ రూపుదిద్దుకొంటోంది. దీనిపేరే ‘మెటావర్స్’ (Metaverse). సోషల్ మీడియా కాన్సెప్ట్ ల సహాయంతో తయారు చేసిన రిచ్ యూజర్ ఇంటరాక్షన్ డిజిటల్ ప్రపంచాన్నే మెటావర్స్ అంటారు.
Read More : Metaverse: మెటావర్స్ అంటే ఏంటి.. ఈ సూపర్ టెక్నాలజీతో మనం ఏం చేయొచ్చు..?
ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అంతులేని ప్రపంచం. దూరంగా ఉన్న వాళ్లు ఒకరినొకరు వర్చువల్ గా కలుసుకోవచ్చు. వర్చువల్ గా, రియల్ టైమ్ లో ఒకరినొకరు చూస్తూ.. అన్నీ పనులు చేసుకొనే అవకాశం ఉంది. స్నేహితులు ఏదైనా టూర్ కు వెళితే.. మీరు మిస్ అయ్యారని అనుకోండి. ఈ టెక్నాలజీ (Metaverse) సహాయంతో మీ ఇంట్లో ఉండి మీ ఫ్రెండ్స్ తో కనెక్ట్ అయి… ఆ టూర్ లో పొందిన అనుభూతిని పొందగలుగుతారు. తమ పేరెంట్ కంపెనీ పేరును “మెటా(Meta)” గా మార్చుతున్నట్టు ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ గురువారం అక్టోబర్ 28, 2021 నాడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read More : Tamilnadu : ఈ పెళ్లి.. చాలా వెరైటీ గురూ, ఇలాంటి వేడుక ఇండియాలోనే జరగలేదు!
అయితే.. మెటావర్స్ అనుభూతిని పొందాలంటే మాత్రం ప్రత్యేకమైన గ్యాడ్జెట్స్ అవసరం ఉంటుంది. మెటావర్స్ ఫీల్ కు ఉపయోగపడే గ్యాడ్జెట్స్ తో మెటాస్టోర్ ను అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలో బర్లింగేమ్ క్యాంపస్ లో తొలి మెటాస్టోర్ ను 2022, మే 09వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఆన్ లైన్ పోర్టల్ మెటాడాట్ కామ్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందులో దొరికే గ్యాడ్జెట్స్ ను కొన్న తర్వాతే.. మెటావర్స్ మీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కానీ.. ఈ గ్యాడ్జెట్స్ ఎంత ధరల్లో లభిస్తున్నాయనే సంగతి తెలియరావడం లేదు.