Flipkart Big Billion Days Sale : త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. భారీగా తగ్గనున్న ఐఫోన్ 15 సిరీస్‌.. పూర్తి వివరాలివే!

Flipkart Big Billion Days Sale : ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ సహా ఐఫోన్ 15 సిరీస్‌తో సహా అన్ని స్మార్ట్‌ఫోన్‌లు భారీ డీల్‌లను పొందుతాయని ఫ్లిప్‌కార్ట్ షేర్ చేసింది.

Flipkart Big Billion Days Sale : త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. భారీగా తగ్గనున్న ఐఫోన్ 15 సిరీస్‌.. పూర్తి వివరాలివే!

Flipkart Big Billion Days Sale to offer big price drop on iPhone 15 series

Updated On : September 14, 2024 / 11:31 PM IST

Flipkart Big Billion Days Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఐఫోన్ 16 సిరీస్‌ లాంచ్ అనంతరం పాత జనరేషన్ ఐఫోన్ 15 సిరీస్ ధర భారీగా తగ్గనుంది. 2023లో ఐఫోన్ 15 సిరీస్ రూ.79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ ఈ ఐఫోన్ 15 ధరను రూ.69,900కి విక్రయిస్తోంది.

Read Also : Best Phones 2024 : ఈ సెప్టెంబరులో రూ. 40వేల లోపు ధరలో టాప్ ఫోన్‌లివే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

అయితే, బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఈ ఐఫోన్ 15 ధరను మరింత తగ్గించాలని చూస్తోంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ సహా ఐఫోన్ 15 సిరీస్‌తో సహా అన్ని స్మార్ట్‌ఫోన్‌లు భారీ డీల్‌లను పొందుతాయని ఫ్లిప్‌కార్ట్ షేర్ చేసింది. ఈ ఐఫోన్‌లపై కచ్చితమైన తగ్గింపులను వెబ్‌సైట్ వెల్లడించలేదు. ఇందుకోసం సెప్టెంబర్ 23 వరకు వేచి ఉండాలి. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్లపై తగ్గింపు ధరలను వెల్లడించనుంది.

ఐఫోన్ 15 ధర తగ్గింపు..? కొనుగోలు చేయాలా? వద్దా? :
ఐఫోన్ 15 సిరీస్ ఏళ్ల ఐఫోన్ 16 సిరీస్ ఐఫోన్ 15 కన్నా హైగ్రేడ్ ఫీచర్లను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, లాస్ట్ జెన్ మోడల్‌ను కొనుగోలు చేయొచ్చు. ప్రత్యేకించి మీకు ప్రో మోడల్‌ బడ్జెట్ ఉంటే.. ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఐఫోన్ 16 మాదిరిగా పొందుతాయి.

అత్యంతగా ఎదురుచూస్తున్న ఆపిల్ ఇంటెలిజెన్స్ 15ప్రో మోడల్‌లలో కూడా కనిపిస్తుంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ తయారీ ఇప్పటికే ఆపిల్ నిలిపివేసింది. మార్కెట్లో మిగిలిన కొన్ని స్టాక్ ఐఫోన్లు మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉండటం గమనార్హం. బేస్ మోడల్‌ విషయానికి వస్తే.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ రెండూ ఐఓఎస్ 18కి సపోర్టు అందిస్తాయి. ఐఫోన్ 16 బేస్ మోడల్‌లు రీడిజైన్‌ను కలిగి ఉండగా, ఐఫోన్ 16 ప్రో మోడల్‌లు ఐఫోన్ 15 ప్రోలను పోలి ఉంటాయి.

ఐఫోన్ 15 vs ఐఫోన్ 16 :
ఐఫోన్ 15 సిరీస్ ఎ16 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్, ఇన్‌స్టంట్ యాప్ లోడ్‌తో వస్తుంది. గేమ్‌ను ఆడుతున్నప్పుడు కూడా చాలా వేగంగా పనిచేస్తుంది. ఐఫోన్లతో వీడియో రికార్డింగ్‌ చేసినా లేదా క్రియేటర్ అయినా లేదా మొబైల్ గేమర్ అయినా ఐఫోన్ 15 ప్రాసెసింగ్ పవర్ ఆకట్టుకుంటుంది. ఐఫోన్ 16 సిరీస్ లేటెస్ట్ ఎ18 చిప్‌సెట్‌, ఎ16 చిప్, ఎ17 చిప్ కూడా చాలా వేగంగా ఉంటాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 15 రెండూ ఒకే డిస్‌ప్లేను అందిస్తాయి. మీరు రెండు ఐఫోన్లలో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ స్క్రీన్‌ని పొందుతారు. ప్యానెల్‌లు 2000నిట్స్ గరిష్ట ప్రకాశంతో పూర్తి హెచ్‌డీ+ రిజల్యూషన్‌కు సపోర్టు ఇస్తాయి.

కెమెరా విషయానికి వస్తే.. చాలా చిన్న మార్పులు ఉన్నాయి. ఐఫోన్ 16 అదే 48ఎంపీ ప్రైమరీ కెమెరాను ఎఫ్/1.6 ఎపర్చరు, సెన్సార్ క్రాప్ ద్వారా 2ఎక్స్ జూమ్‌తో వస్తుంది. అదే 12ఎంపీ కెమెరాను కలిగి ఉంది. అయితే, ఐఫోన్ 15లో కనిపించే ఎఫ్/2.4తో పోల్చితే.. మెరుగైన ఎఫ్/2.2 ఎపర్చరుతో వస్తుంది. ఐఫోన్ 16లో మీరు కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా పొందుతారు. ఫొటోలను త్వరగా తీయడంలో సాయపడుతుంది. జూమ్ ఇన్ లేదా అవుట్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఐఫోన్ 16 తర్వాత కూడా ఐఫోన్ 15 సిరీస్ ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న ఫోన్ అని చెప్పవచ్చు.

Read Also : Sunita Williams : ‘మేం పనిచేయకుంటే.. ఎముకల సాంద్రతను కోల్పోతాం.. అంతరిక్షంలో సవాళ్లపై సునీతా విలియమ్స్ ఇంకా ఏమన్నారంటే?