Google Search Down : గూగుల్ సర్వర్ డౌన్ : మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎఫెక్ట్.. ఎట్టకేలకు ఇష్యూ ఫిక్స్ చేసిందిగా..!

Google Server Down : ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా తమ ఫిర్యాదులు చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ యాప్‌తో సమస్యలను ఎక్కువగా నివేదించారు.

Google Search Down : గూగుల్ సర్వర్ డౌన్ : మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఎఫెక్ట్.. ఎట్టకేలకు ఇష్యూ ఫిక్స్ చేసిందిగా..!

Google Down_ Tech Giant Fixes Issue That Affected Millions Of Android Users Globally

Updated On : September 15, 2024 / 4:34 PM IST

Google Server Down : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సర్వర్ డౌన్ అయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ప్రభావితమయ్యారు. కొన్ని గంటల తర్వాత సర్వర్ సంబంధిత సమస్యను యూఎస్ ఆధారిత టెక్ దిగ్గజం ఎట్టకేలకు పరిష్కరించింది.

ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది ఆండ్రాయిడ్ యూజర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా తమ ఫిర్యాదులు చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ యాప్‌తో సమస్యలను ఎక్కువగా నివేదించారు. “మేము సర్వింగ్‌లో సమస్యను పరిష్కరించాం. ఇకపై ఎలాంటి అప్‌డేట్‌లు ఉండవు” అని కంపెనీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ స్టేటస్ వెబ్ పేజీలో వెల్లడించింది.

ఆండ్రాయిడ్ యూజర్ల ప్రకారం.. :
గూగుల్ సెర్చ్ బార్ విడ్జెట్ క్రాష్ అయ్యే ముందు పాత సెర్చ్ రిజిల్ట్స్ మాత్రమే చూపిస్తుందని పేర్కొన్నారు. గూగుల్ డిస్కవర్ కూడా ఓపెన్ కావడం లేదని నివేదించారు. అలాగే, వాయిస్ సెర్చ్ మైక్రోఫోన్‌ను ట్యాప్ చేసినా గూగుల్ యాప్ పనిచేయలేదు. గూగుల్ స్టేటస్ పేజీ ప్రకారం.. ఈ సమస్య సెప్టెంబర్ 14న ఉదయం 10:52 గంటలకు ప్రారంభమైంది.

గూగుల్ ఒక గంట తర్వాత అంటే.. సెప్టెంబర్ 15న ఆదివారం ఉదయం 11:30 గంటలకు అంతరాయాన్ని నిర్ధారించింది. గూగుల్ ఈ సమస్యను గుర్తించి వెంటనే పరిష్కారించేందుకు తమ టీమ్ పనిచేస్తోందని తెలిపింది. ‘ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్ యాప్‌లో పెద్ద సంఖ్యలో వినియోగదారులు సెర్చ్ చేస్తుంటారు.

అయితే, గూగుల్ సెర్చ్‌లో సర్వీసు పనిచేయకపోవడంతో ఈ యాప్ తాత్కాలికంగా క్రాష్ అయింది. దీనికి అసలు కారణం ఏంటి అనేది గుర్తించే పనిలో ఉన్నామని గూగుల్ పేర్కొంది. నెక్స్ట్ అప్‌డేట్ 12 గంటల్లోగా రిలీజ్ చేస్తామని తెలిపింది. అనంతరం గూగుల్ తమ సర్వింగ్‌లో సమస్యను పరిష్కరించామని, సిస్టమ్‌లు స్టేబుల్‌గా మారుతున్నాయని తెలిపింది. ఇప్పటికీ ఆండ్రాయిడ్‌లోని గూగుల్ యాప్‌లో సాంకేతిక సమస్యలను ఉన్నాయని, నెక్స్ట్ అప్‌డేట్ సెట్టింగ్‌ ద్వారా యాప్ డేటాను క్లియర్ చేసేందుకు ప్రయత్నించవచ్చునని సెర్చ్ దిగ్గజం వినియోగదారులకు సూచించింది.

అంతరాయానికి కారణమేమిటి? :
అయితే, అంతరాయానికి కచ్చితమైన కారణాన్ని గూగుల్ ఇంకా వెల్లడించనప్పటికీ, డౌన్‌డెటెక్టర్.కామ్, అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్, 67 శాతం మంది వినియోగదారులు గూగుల్ సెర్చ్‌తో సమస్యలను నివేదించారు. మరో 30 శాతం మంది వెబ్‌సైట్‌ ద్వారా సమస్యలను ఎదుర్కొన్నారని వెల్లడించింది. అలాగే, 3 శాతం మంది వినియోగదారులు గూగుల్ మ్యాప్స్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు.

చాలా మంది విసుగు చెందిన వినియోగదారులు సమస్యను గూగుల్‌కు నివేదించడానికి సోషల్ మీడియా వేదికగా తమ సమస్యలను నివేదించారు. “గూగుల్ మరెవరికైనా పనికిరాకుండా పోయిందా? ఇంకా క్రాష్ అవుతూనే ఉంది” ఒక యూజర్ కామెంట్ చేయగా, “ఎంత ఆసక్తికరం… కనీసం నా ఫోన్‌లో గూగుల్ డౌన్‌ అయింది. మీ ఐఫోన్ లేదా శాంసంగ్‌లో మరెవరూ బ్రౌజర్‌ని ఓపెన్ చేయలేరు” అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు.

Read Also : Netflix Support iPhones : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై ఈ ఐఫోన్లు, ఐప్యాడ్‌లలో నెట్‌ఫ్లిక్స్ పనిచేయదు..!