Honor X7c Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీతో హానర్ X7c ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
Honor X7c Launch : హానర్ ఫోన్ 6.77-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. 35డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.

Honor X7c With Snapdragon 4 Gen 2 SoC, 6,000mAh Battery Launched
Honor X7c Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ నుంచి సరికొత్త మోడల్ ఫోన్ వచ్చేసింది. హానర్ ఎక్స్7బీకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా హానర్ ఎక్స్7సీ అజర్బైజాన్లో లాంచ్ అయింది. ఈ కొత్త హానర్ ఎక్స్ సిరీస్ ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఎస్ఓసీపై రన్ అవుతుంది. ఈ ఫోన్ రెండు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది.
హానర్ ఫోన్ 6.77-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. 35డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. హానర్ ఎక్స్7సీ ఫోన్ నీరు, ధూళి నిరోధకతకు ఐపీ64 రేటింగ్‌ను కలిగి ఉంది.
హానర్ ఎక్స్7సీ ధర ఎంతంటే? :
హానర్ ఎక్స్7సీ బేస్ 6జీబీ ర్యామ్+ 128జీబీ ట్రిమ్ ధర ఏజెఎన్ 359 (దాదాపు రూ. 17వేలు). అదే సమయంలో, 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజీతో టాప్-ఎండ్ వెర్షన్ ధర ఏజెఎన్ 410 (దాదాపు రూ. 20,200). ఈ ఫోన్ మొత్తం ఫారెస్ట్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్, మూన్లైట్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
హానర్ ఎక్స్7సీ స్పెసిఫికేషన్లు :
హానర్ ఎక్స్7సీ ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0పై రన్ అవుతుంది. 6.77-అంగుళాల టీఎఫ్టీ ఎల్సీడీ హెచ్డీ+ (720×1,610 రిజల్యూషన్) డిస్ప్లేను కలిగి ఉంది. హుడ్ కింద అడ్రినో 610 జీపీయూతో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్సెట్, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. హానర్ ఎక్స్7సీ 108ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
హానర్ ఎక్స్7సీలోని కనెక్టివిటీ ఆప్షన్లలో 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, వై-ఫై 802.11 ఎ/బి/జి/ఎన్/ఏసీ, బ్లూటూత్ 5, జీపీఎస్, ఓటీజీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్, ఎన్ఎఫ్సీ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్, గ్రావిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.
హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందిస్తుంది. హానర్ ఎక్స్7సీ 35డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌పై 59 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 166.8×76.8×8.24ఎమ్ఎమ్, బరువు 196 గ్రాములు. ఈ ఫోన్ ఐపీ64 డస్ట్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది.