Facebook అకౌంట్ పర్మినెంట్ డిలీట్ చేయండిలా!

Facebook అకౌంట్ పర్మినెంట్ డిలీట్ చేయండిలా!

How Delete Everything Facebook Knows About You 22930

Updated On : May 14, 2021 / 12:22 PM IST

మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా? మరో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారా? పాత Facebook డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఎలా డిలీట్ చేయాలో తెలియదా? అకౌంట్ డిలీట్ చేయకుండా అలానే ఉంచేస్తే మీ వివరాలన్నీ ఫేస్ బుక్ సర్వర్లలో ఉండిపోతాయి. మీగురించి ఫేస్ బుక్ అంతా తెలుసు అనే విషయం మరవొద్దు.

ఫేస్‌బుక్ అకౌంట్ పర్మినెంట్‌గా డిలీట్ చేసుకోవచ్చు. మీ అకౌంటును డియాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిలీట్ చేసిన అకౌంట్‌ శాశ్వతంగా డిలీట్ కావడానికి 90రోజుల సమయం ఉంటుంది. ఈలోగా డిలీట్ రిక్వెస్ట్ పెట్టిన అకౌంట్ తిరిగి ఓపెన్ చేస్తే మళ్లీ యాక్టివేట్ అవుతుంది.

దీంతో డిలీట్ అయిన అకౌంట్లోని డేటా హిస్టరీ కూడా రీస్టోర్ అవుతుంది. ఫేస్ బుక్ డేటాబేస్ నుంచి పూర్తిగా మీ పర్సనల్ డేటా డిలీట్ కావాలంటే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి..

* Facebook అకౌంట్ Log in అవ్వండి.
* Facebook Delete Data లింక్ పై Click చేయండి.
* మీ అకౌంట్ డిలీట్ చేయాలో లేదా Confirm చేయండి.
* Deactivate చేయాలంటే Deactivate Account పై Click చేయండి.
* డిలీట్ రిక్వెస్ట్ నుంచి మీ పోస్టులు, ఫొటోలు, వీడియోలన్నీ డిలీట్ అవుతాయి.
* బ్యాకప్ సిస్టమ్స్, స్టోర్ అయిన ఇతర డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది.
* డిలీట్ రిక్వెస్ట్ తర్వాత నుంచి ఫేస్ బుక్ సెర్చ్ లో మీ అకౌంట్ కనిపించదు.
* ఒకవేళ, డిలీట్ రిక్వెస్ట్ Cancel చేసుకోవాలనుకుంటే చేసుకునే అవకాశం ఉంది.
* 90 రోజుల వ్యవధిలో మీ Username, Passwordతో Login కాగానే అకౌంట్ రీయాక్టివేట్ అవుతుంది.
* కానీ, Login అయ్యే Window Close చేస్తే మాత్రం మీ డేటా డిలీట్ అయి తిరిగి రాదు.