YouTubeను టీవీలో చూడొచ్చు, Screen Casting చేయండిలా

  • Published By: sreehari ,Published On : December 26, 2019 / 11:34 AM IST
YouTubeను టీవీలో చూడొచ్చు, Screen Casting చేయండిలా

Updated On : August 21, 2020 / 5:55 PM IST

యూట్యూబ్ లో వీడియోల కోసం సెర్చ్ చేస్తున్నారా? మీ కోసం వాయిస్ కమాండ్స్ ఫీచర్ ఒకటి అందుబాటులోకి వచ్చేసింది.ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. Youtubeలో వీడియోలు సెర్చ్ చేసేందుకు వాయిస్ కమాండ్స్ ఫీచర్ రిలీజ్ చేసింది. అదే.. వాయిస్ సెర్చ్ ఫీచర్. దీని సపోర్టుతో ఈజీగా Screen Casting చేసుకోవచ్చు. యూట్యూబ్ యాప్‌తో పెద్ద స్ర్కీన్లపై Casting చేస్తున్నారా? అయితే మీకు ఈ వాయిస్ సెర్చ్ కమాండ్ అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ లేటెస్ట్ ఫీచర్ ప్రస్తుతం.. Android, iOS ప్లాట్ ఫాంల్లో అందుబాటులోకి వచ్చేసింది. డీపర్ వాయిస్ సెర్చ్ ఇంటిగ్రేషన్ మాత్రమే కాకుండా Youtube.. మరో కొత్త ‘Who’s Watching’ అనే ఫీచర్ కూడా యాడ్ చేసింది. ఈ ఫీచర్ సాయంతో మీ స్మార్ట్ ఫోన్లో వివిధ Youtube Profiles నుంచి ఈజీగా ఒకదాని నుంచి మరొక దానికి ఈజీగా స్విచ్ అయిపోవచ్చు. Same Youtube వినియోగించే వివిధ వ్యక్తిగత యూజర్లకు వారి బెటర్ పర్సనలైజేషన్ కోసం ఈ ఫీచర్ అనుమతి ఇస్తుంది.

అంతేకాదు.. యూట్యూబ్ navigation menu కూడా అప్ డేట్ చేసింది. మీ డివైజ్‌లో ఎడమ వైపుభాగంలో అది రీలొకేట్ చేసింది. ఇప్పటినుంచి మీ అకౌంట్ ప్రొఫైల్ ఐకాన్ Menuపై ప్రముఖంగా ఎంతో ఎట్రాక్టీవ్‌గా కనిపిస్తుంది. వివిధ డివైజ్‌లు, స్ర్కీన్ రెజుల్యుషన్ అన్నింటిపై సపోర్ట్ మరింత అందించేలా యూట్యూబ్ వర్క్ చేస్తోందని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇక యూట్యూబ్ యూజర్లు PS4, PS4 Pro డివైజ్ లపై HDRలో ఈజీగా Stream చేసుకోవచ్చు.

2019 ఏడాదిలోనే అమెజాన్ Fire TV డివైజ్‌లపై కూడా అధికారిక యూట్యూబ్ యాప్ లాంచ్ అయింది. దీని ద్వారా న్యూస్, గేమింగ్, ఎంటర్ టైన్ మెంట్, how to videos, మ్యూజిక్ సహా డైవర్స్ లైబ్రరీ వీడియో కంటెంట్ అన్నింటిని Fire TV యూజర్లు ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. Official Youtube Appలో అలెక్సా కూడా వర్క్ అవుతుంది. ఫైర్ టీవీలో మీకు నచ్చిన అన్ని ఫేవరేట్ వీడియోలను వీక్షించవచ్చు అని గూగుల్ ఒక బ్లాగు పోస్టులో తెలిపింది.

Voice Search ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
* మీ mobile డివైజ్‌లో Youtube App అప్‌డేట్ చేసుకోండి.
* ఇప్పుడు Youtube యాప్ ఓపెన్ చేయండి.
* Cast బటన్ పై నొక్కి మీ స్ర్కీన్ Mirror అప్లికేషన్ రన్ చేయండి.
* డివైజ్ స్ర్కీన్ పై Overlay పై Tap చేయండి.
* Overlay ఫీచర్లలో Volume స్లైడర్, Connect/disconnect బటన్లు ఉంటాయి.
* ఇక్కడే మీకు Voice Search అనే ఆప్షన్ కనిపిస్తుంది.
* mic ఐకాన్ పై Tap చేయండి.
* మీ Voice commands ద్వారా Youtube వీడియోల కోసం సెర్చ్ చేయండి.