ఇదో రియల్ టెర్మినేటర్ : సూపర్ ఇంటెలిజెంట్ AI చాలా పవర్ ఫుల్.. ఒకసారి క్రియేట్ చేస్తే.. కంట్రోల్ చేయలేరు!

super-intelligent AI system : మనుషుల కంటే సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అత్యంత శక్తివంతమైనది. హాలీవుడ్ మూవీ ‘ది టెర్మినేటర్’ చూశారా? అచ్చం అలానే పనిచేస్తుంది ఈ సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ. సూపర్ పవర్ టెక్నాలజీతో పనిచేసే ఈ కృత్రిమ మేధస్సు కలిగిన ఇంటెలిజెంట్ ఏఐ సిస్టమ్.. దాని సామర్థ్యం ఏ స్థాయిలో ఉంటుందో క్రియేట్ చేసిన మనుషులు కూడా ఊహించలేనింత డేంజరస్ గా ఉంటుందంట. క్రియేట్ చేయడం వరకే.. ఆ తర్వాత సూపర్ ఏఐ సిస్టమ్ కంట్రోల్ చేయడం మనుషులకే సాధ్యపడదంట.. ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. ఈ సూపర్ ఇంటెలిజెంట్ భాగాన్ని రియల్ గా క్రియేట్ చేస్తే.. మనుషులు కూడా దాని సామర్థ్యాన్ని అడ్డుకోలేరంట.. అత్యంత శక్తివంతంగా ఉంటుందంట.
దీనికి సంబంధించి అధ్యయనాన్ని మాక్స్-ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్స్ అండ్ మెషీన్స్ నిర్వహించిన జర్నల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్‌లో ప్రచురించారు. ఏఐ డెవలప్ చేయలన్నా.. దాన్ని విస్తరించలన్నా అంత సులువైన విషయం కాదని అంటున్నారు రీసెర్చర్లు. ప్రపంచాన్ని నియంత్రించే ఒక సూపర్ ఇంటెలిజెంట్ మెషీన్ సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుందని పరిశోధనా అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన మాన్యువల్ సెబ్రియన్ చెప్పారు.
ఒక మిషన్ క్రియేట్ చేసిన తర్వాత.. అది ఒకవేళ మనుషుల కంట్రోల్ దాటిపోతే.. అదేలా ప్రవర్తిస్తుందో చెప్పలేమంటున్నారు. అది సృష్టించే వినాశనం ఏ స్థాయిలో ఉంటుందో కూడా ఊహించలేమని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అవంతరాలు రాకుండా ఒక మిషన్‌ను నిరోధించడానికి ఏదైనా కంటైనర్ అల్గోరిథంలను ఉపయోగించవచ్చా? అనే ప్రశ్నతో అధ్యయనం కొనసాగింది. అసలు సమస్య ఏమిటంటే.. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే క్రియేట్ చేసిన మిషన్ లెర్నింగ్ ఆపడానికి అల్గోరిథంలు అంతగా పవర్ ఫుల్ కాదని అంటున్నారు. అన్ని మిషన్లకు ఉపయోగించగల ఒకే అల్గోరిథం అసాధ్యమని చెబుతున్నారు.
ప్రతి వ్యక్తి వ్యవస్థకు వేర్వేరు కంటైనర్ అల్గోరిథంలను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని ట్యూరింగ్ 1936 నాటికి తేల్చారు. ప్రస్తుత కంప్యూటర్లు అందులోని ప్రొగ్రామ్స్ మరింత అత్యాధునిక టెక్నాలజీ పెరిగినందున దాన్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదంటున్నారు. అందుకే.. ఇలంటి సూపర్ ఏఐ సిస్టమ్ ను క్రియేట్ చేయకపోవడమే మంచిదని అధ్యయన పరిశోధకుల్లో ఒకరైన ఇయాద్ రవావహన్ అభిప్రాయపడ్డారు. అధునాతన మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించి ఆధునిక కంప్యూటర్ల సామర్థ్యంతో ఒక సూపర్ ఇంటెలిజెంట్ AI సిస్టమ్ డెవలప్ చేయడం చాలా కష్టతరమైనది పేర్కొన్నారు. ఏదిఏమైనా.. సూపర్ పవర్ ఏఐ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ముందు మనుషులంతా పూర్తిగా బలహీనులేనని అధ్యయనపరంగా తేలింది.