Independence Day Sale : ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్.. ఈ డీల్స్ మిస్ చేసుకోవద్దు..!

Independence Day Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

Independence Day Sale : ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్లు.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. లిమిటెడ్ ఆఫర్.. ఈ డీల్స్ మిస్ చేసుకోవద్దు..!

Independence Day Sale Offers Unbeatable Deals on Gadgets

Updated On : August 15, 2023 / 7:18 PM IST

Independence Day Sale : స్వాతంత్ర్య దినోత్సవం 2023 సేల్ సందర్భంగా ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతిసారీ ఈ రోజును విభిన్నమైన థీమ్‌తో గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ‘నేషన్ ఫస్ట్, ఆల్వే ఫస్ట్’ అనే థీమ్‌తో జరుపుకుంటున్నాం. 76 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆనందంలో ఈ నెల 15వ తేదీకి ముందు అనేక ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అద్భుతమైన డీల్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి.

ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కస్టమర్లు తమకు ఇష్టమైన ప్రొడక్టును చౌకగా కొనుగోలు చేయవచ్చు. 2023 ఇండిపెండెన్స్ డే సేల్ సందర్భంగా కొనసాగుతున్న సేల్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్లు, డీల్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐఫోన్ నుంచి టాబ్లెట్‌ల వరకు భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే, విజయ్ సేల్స్ ఇండిపెండెన్స్ డే సేల్‌లో విభిన్నమైన ఆఫర్లు అందిస్తున్నాయి.

Read Also : Airtel Plan Offer : ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్.. కేవలం రూ.99 మాత్రమే.. అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్..!

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ :
గూగుల్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో చౌకగా లభిస్తుంది. మీరు గూగుల్ పిక్సెల్ 6aని కేవలం రూ. 26,999కి ఆఫర్ల కింద కొనుగోలు చేయవచ్చు. కస్టమ్ టెన్సర్ చిప్ ఆధారంగా ఈ ఫోన్‌లో eSIM సపోర్ట్ అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫోన్ నీరు, ధూళి నిరోధకతకు IP67 రేటింగ్ అయింది. ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను పొందిన ఫస్ట్ ఫోన్ ఇదే. ఈ 5G ఫోన్‌లో అనేక సరికొత్త ఫీచర్లు ఉన్నాయి.

Independence Day Sale Offers Unbeatable Deals on Gadgets

Independence Day Sale Offers Unbeatable Deals on Gadgets

ఆపిల్ ఐఫోన్ 14 :
ఆపిల్ లేటెస్ట్ ఫోన్ అంటే.. iFoam 14ని కొనుగోలు చేయాలనుకుంటే.. విజయ్ సేల్స్ నుంచి చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 మెగా ఫ్రీడమ్ సేల్ కింద కేవలం రూ.69,900కి విక్రయిస్తోంది. దీని ధరపై మరింత డిస్కౌంట్ అందించడానికి బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. HDFC కార్డ్‌ని ఉపయోగించి, మీరు రూ. 4,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అయితే, పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మీరు రూ. 8వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

మోటోరోలా G14 స్మార్ట్‌ఫోన్ :
మోటోరోలా లేటెస్ట్ Moto G14ని ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రూ.9,999కి విక్రయిస్తున్నారు. ఇందులో లభించే ఇతర ఆఫర్లు ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. ఈ ఫోన్ 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 13OSలో పని చేస్తుంది.

ఆపిల్ iPad (9th Gen) టాబ్లెట్ :
విజయ్ సేల్స్‌లో కొనసాగుతున్న మెగా ఫ్రీడమ్ సేల్‌లో ఆపిల్ 9వ జనరేషన్ ఐప్యాడ్ కేవలం రూ.27,990కే అందుబాటులో ఉంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీని ధరపై మరింత తగ్గింపు పొందవచ్చు. ఆపిల్ 9వ జనరేషన్ ఐప్యాడ్ 64GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.

Read Also : Redmi K60 Ultra Launch : రెడ్‌మి K60 అల్ట్రా ఫోన్ వచ్చేసిందోచ్.. భలే ఉంది భయ్యా ఫోన్.. ఫీచర్ల కోసమైన ఫోన్ కొనాల్సిందే..!