ఐసోలేషన్ యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో Co-Watching ఫీచర్.. స్నేహితులతో ఒకేసారి వీడియోలు చూడొచ్చు

ఐసోలేషన్ యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో Co-Watching ఫీచర్.. స్నేహితులతో ఒకేసారి వీడియోలు చూడొచ్చు

Updated On : June 19, 2021 / 4:51 PM IST

ప్రముఖ ఫొటో-వీడియో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్ వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. సామాజిక దూరాన్ని పాటించేలా అందరిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సోషల్ యాప్ ఇన్ స్టాగ్రామ్ కూడా తమ యూజర్ల కోసం సామాజిక దూరం ప్రాముఖ్యతను తెలియజేసేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 23న ‘Co-Watching’ ఫీచర్ ప్రవేశపెట్టింది.

సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లోనే ఉంటూ మీ స్నేహితులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ కో-ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఒకవైపు తమ పోస్టులను స్ర్కోల్ చేస్తూనే రిమోట్ మోడ్‌లో వీడియోలను వీక్షించవచ్చు. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లోని డైరెక్ట్ మెసేజ్ గ్రూపు చాట్ లోని అప్పర్ లెఫ్ట్ కార్నర్‌పై ఉన్న Video Icon క్లిక్ చేయవచ్చు లేదా కొత్త కాన్వర్జేషన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది.

అంతేకాదు.. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ఫిల్టర్లను కూడా యాక్సస్ చేసుకునే వీలుంది. ఇన్ స్టాగ్రామ్‌లో ప్రధానంగా యూజర్లు కింది స్ర్కోల్ చేస్తూ తమ స్నేహితుల పోస్టులు, స్టోరీలు లేదా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లను ఒకేసారి వీక్షించవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇన్ స్టాగ్రామ్ యూజర్లంతా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.

చాలామంది యూజర్లు ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ చాట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో కో-వాచ్ ఫీచర్ తోపాటు ‘స్టే ఎట్ హోమ్’ స్టిక్కర్ ద్వారా ఈ స్టోరీలను పోస్టు చేయవచ్చు. మీ ఫాలోవర్లు, స్నేహితులను కరోనా నుంచి సురక్షితంగా ఉండేలా చూడొచ్చు. ప్రతిఒక్కరి కోసం ఇన్ స్టాగ్రామ్ బిగ్గర్ షేర్డ్ స్టోరీని కూడా క్రియేట్ చేసింది.