Vijay Mallya on Maybach: మేబ్యాచ్ కారులో ముంబై రోడ్లపై విజయ్‌మాల్యా
కార్ల కలెక్షన్లో విజయ్ మాల్యా క్రేజ్ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. ఎక్స్‌పెన్సివ్ కార్లన్నింటిని వేలం వేయాలని..

Maybach That Belonged To Vijay Mallya Spotted Cruising On Mumbai Roads
Vijay Mallya on Maybach: కార్ల కలెక్షన్లో విజయ్ మాల్యా క్రేజ్ ఎలాంటిదో చెప్పనవసరం లేదు. ఎక్స్‌పెన్సివ్ కార్లన్నింటిని వేలం వేయాలని కోర్ట్ ఆర్డర్. ఇండియన్ బ్యాంకుల్లో రూ.10వేల కోట్ల అప్పులు తీర్చేందుకే ఈ పని చేసింది. ఈ ఆర్డర్ 2018లోనే పాస్ అయినా.. రీసెంట్ గా Maybach62తో ముంబై రోడ్లపై కనిపించారు.
చూడబోతే విజయ్ మాల్యా సొంతకారులో ప్రయాణిస్తున్నట్లు లేదు. CS 12 VLOGS అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసిన వీడియో 7నిమిషాల 23సెకన్ల పాటు ఉంది. విజయ్ మాల్యా వెహికల్స్ నెంబర్ ప్లేట్లలో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ‘BO55 VJM’, ‘F1 VJM’, ‘OO07 VJM’ వంటివి ఉండేవి.
డామ్లెర్ మేబ్యాచ్62 కార్ అమ్మకాలను ఆపేసింది. ఎందుకంటే వాహనం మంచిగా లేకపోవడం కాదు. 2012లోరిలీజ్ అయిన లగ్జరీ కార్లలో ఇదొకటి. రూ.5.80కోట్లు వెచ్చిస్తే గానీ అందుబాటులోకి వచ్చేది. ఇదెంత కాస్ట్లీయో చెప్పాలంటే.. దీని ధరకు రోల్స్ రాయ్స్ ఫాంటమ్ సిరీస్-II నే వచ్చేసేది.

Maybach (1)
ఇక మేబ్యాచ్ 62 విషయానికొస్తే 5.5 లీటర్ల కెపాసిటీ ఇందనంతో పాటు 5స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది. దీని అమ్మకాలు 2002 నుంచి 2012వరకే జరిగాయి. ఈ కార్ లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. డ్రైవర్ కంపార్ట్ మెంట్ కు వెనుకకు సపరేషన్ కూడా ఉంది.
ఇదే కంపెనీకి చెందిన కార్లను కరణ్ జోహార్, హృతిక్ రోషన్, సంజయ్ ఖాన్, భూషణ్ కుమార్ లతో పాటు రాణి ముఖర్జీ, దీపికా పదుకొణె, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లు కూడా ఇవి వాడారు.