Moto G7 వచ్చేసింది : ఎట్రాక్టింగ్ ఫీచర్లు ఇవే
ప్రపంచ మొబైల్ మేకర్ దిగ్గజం మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.

ప్రపంచ మొబైల్ మేకర్ దిగ్గజం మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.
ప్రపంచ మొబైల్ మేకర్ దిగ్గజం మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. మార్చి 25న ఇండియన్ మార్కెట్లో G series ను మోటోరోలా కంపెనీ లాంచ్ చేసింది. అదే.. మోటో G7. 2019 ఏడాది ప్రారంభంలోనే మోటోరోలా జీ7 సిరీస్ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
ఇందులో మొత్తం మోటో జీ7 ప్లస్, మోటో జీ7 పవర్, మోటో జీ7 ప్లే. మోటో జీ7 పవర్ ఇదివరకే ఇండియాలో లాంచ్ అయింది. మోటో జీ7 సిరీస్ లో ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. వీటిలో ప్రత్యేకించి స్ర్కీన్ డిసిప్లే 6.24 అంగుళాలు Full HD+ ప్లస్ స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు.
వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్, డ్యుయల్ రియర్ కెమెరాలు, స్టాక్ ఆండ్రాయిడ్ 9.0 పై వంటి ఎన్నో సెష్పిఫికేషన్లు ఎట్రాక్టీవ్ ఉన్నాయి.. ఇండియాలో మోటో జీ7 ధర ఎంత ఉందనే దానిపై అధికారికంగా ఇంకా క్లారిటీ లేదు. ప్రైస్ ట్యాగ్ 299 డాలర్లు (రూ.21వేల 360) అంచనా. ఈ ఫోన్ మోడల్ ను 2018లో బ్రెజిల్ లో రిలీజ్ చేశారు. మోటో జీ7 కొత్త స్మార్ట్ ఫోన్ హైలెట్స్, ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
స్పెషిఫికేషన్లు ఇవే..
* 6.24 అంగుళాలు (1080*2270 ఫిక్సల్స్) ఫుల్ హెచ్ డీ ప్లస్ డిసిప్లే
* టీయర్ డ్రాప్ నాచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్.
* క్వాలికామన్ అక్టో-కోర్ స్నాప్ డ్రాగన్ 632 ఎస్ఓసీ
* 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, ఎక్స్ పాండబుల్ మైక్రో SD
* స్టాక్ ఆండ్రాయిడ్ 9.0 పై
* డ్యుయల్ రియర్ కెమెరాలు
* ప్రైమరీ రియర్ కెమెరా 12మెగా ఫిక్సల్
* ఎల్ ఈడీ ఫ్లాష్, ఎఫ్/1.8 అప్రెచర్
* 5 మెగా ఫిక్సల్ సెకండరీ కెమెరా, ఎఫ్/2.2 అప్రెచర్
* 8 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఎఫ్/2.2 అప్రెచర్
* ఫింగర్ ఫ్రింట్ స్కానర్
* 4జీ వోల్ట్, మైక్రో USB టైప్-సి సపోర్ట్
* బ్లూ టూత్ 4.2, 3.5 ఎంఎం ఆడియో జాక్
* 3000ఎంఎహెచ్ బ్యాటరీ, 15వాట్స్ పవర్ సపోర్ట్