మడతబెట్టే ఫోన్ Moto Razr ఫస్ట్ లుక్ చూశారా? ఫీచర్లు అదుర్స్!

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 08:29 AM IST
మడతబెట్టే ఫోన్ Moto Razr ఫస్ట్ లుక్ చూశారా? ఫీచర్లు అదుర్స్!

Updated On : April 28, 2020 / 8:29 AM IST

భారత మార్కెట్లోకి కొత్త మోటో రేజర్ వస్తోంది. మడతబెట్టే స్మార్ట్ ఫోన్లలో ఆకర్షణీమైన ఫస్ట్ లుక్‌తో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో ఫోల్డబుల్ ఫోన్లు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అయ్యే మడతబెట్టే ఫోన్లు మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు కొన్ని ఫోల్డబుల్ ఫోన్లతో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

కొత్త మోటో రేజర్ కూడా అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీమైన డిజైన్‌తో వస్తోంది. కొత్త మోటో రేజర్ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఈ ఫోన్.. మడతబెట్టినప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లలా కనిపించదు. ఒక చిన్న చదరపు రూపంలోకి మారిపోతుంది.

 

అయినప్పటికీ యూజర్ల దృష్టిని వెంటనే ఆకర్షించేలా ఉంటుంది. డివైజ్ ఎక్కువగా ప్లాస్టిక్ తో రూపొందించారు. ఎందుకంటే.. గాజు కంటే అదనపు ధృడత్వాన్ని అందిస్తుంది. పగిలే అవకాశం కూడా ఎక్కువే. 6.2 అంగుళాల ఫోల్డబుల్ P-OLED డిస్‌ప్లే ఉంది. 

ఇక FHD+ రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. బయటవైపు అంటే.. ఫోల్డ్ చేస్తే పైన కనిపించే స్ర్కీన్ 2.7అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఏదైనా మెసేజ్, నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ తో పాటు 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో రన్ అవుతుంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ అడ్రినో 616 GPUతో నడుస్తుంది.

 

కానీ, పరిమాణంలో స్ర్కీన్ చిన్నగా ఉండటంతో గేమింగ్ కాస్తా అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. దీనికి ఫిజికల్ సిమ్ స్లాట్ లేదు. టెలికం ఆపరేటర్ ద్వారా e-SIM టెక్నాలజీతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జియో, ఎయిర్ టెల్ టెలికో కంపెనీలు మాత్రమే ప్రస్తుతం.. e-SIM సర్వీసును అందిస్తున్నాయి. 

కొత్త మోటో రేజర్ వెనుక వైపు 16MP రియర్ కెమరాతో వస్తోంది. ఇది TOF (ప్లైట్ టాప్) డెప్త్ సెన్సింగ్ ఫీచర్లు, డ్యుయల్ ఫిక్సల్ టెక్నాలజీ కలిగి ఉంది. ఇక ఫ్రెంట్ కెమెరాలో ఫుల్ హెచ్ డి వీడియో రికార్డింగ్ సామర్థ్యం కలిగిన 5MP ఫ్రంట్ కెమెరా ఇందులో ఉంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేదు. USB port-C లేదా వైర్ లెస్ హెడ్ ఫోన్ ఉపయోగించాల్సి ఉంటుంది.

ఫిజికల్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంది.. మెయిన్ స్ర్కీన్ కింద ఉంటుంది. మోటరోలా 2.510mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఉంది. ఈ కొత్త మోటో రేజర్ ఫోల్డబుల్ ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అనేదానిపై సమాచారం లేదు. అయితే, ఈ ఏడాది మార్చి నెలలోనే లాంచ్ అవుతుందని అంచనా.