ITR Filing Process : మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? పాత ఆదాయపు పన్ను విధానం ఎలా ఎంచుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ITR Filing Process : కొత్త రూల్స్ ప్రకారం.. జీతం పొందే ట్యాక్స్ ప్లేయర్లు అవసరమైనప్పుడు కొత్త లేదా పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వీలుంది. కొత్త విధానం ఎంచుకుంటే మినహాయింపులు, తగ్గింపులు పొందలేరని గమనించాలి.

ITR Filing Process : మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? పాత ఆదాయపు పన్ను విధానం ఎలా ఎంచుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

How to choose old income tax regime when filing ITR ( Image Source : Google )

ITR Filing Process : ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసే సమయంలో కొన్ని విషయాలను తప్పక గుర్తించుకోవాలి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీకి ఇంకా సమయం ఉంది. వచ్చే జూలై 31, 2024 వరకు సమయం ఉంది. అయినప్పటికీ అప్పటివరకూ ఉండటం కన్నా ముందుగానే ఐటీఆర్ ఫైల్ చేయడం ఉత్తమం. చివరి క్షణాల్లో కంగారులో తప్పులు చేసే కన్నా ముందుగానే నెమ్మదిగా పన్ను దాఖలు చేయడమే శ్రేయస్కరం. ఐటీఆర్ ఫైలింగ్ చేసే ఉద్యోగస్తులు ఫారమ్-16 పొంది ఉండాలి.

Read Also : Jio Tariff Charges : కొడుకు పెళ్లి ఖర్చు మాపై వేస్తున్నావా అంబానీ మావా.. జియో రీఛార్జ్ ధరల పెంపుపై భారీగా ట్రోల్స్..!

అది కూడా తమ కంపెనీ యజమానుల నుంచి తీసుకుని ఉండాలి. జూన్ 15 నుంచే అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం.. ఈ-ఫైలింగ్ ఐటీఆర్‌ దాఖలు చేసే విధానం గతంలో కన్నా చాలా సులభంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేకుండా ఉన్నచోటనే ఇంట్లోనే ఉండి సులభంగా ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేయొచ్చు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఐటీఆర్ ఫైలింగ్ విధానంలో ఏయే రూల్స్ పాటించాలి? ఇంట్లో నుంచే ఎలా ఐటీఆర్ దాఖలు చేయవచ్చునో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పన్ను చెల్లించే విధానంలో కొత్త నిబంధనలివే :
కొత్త రూల్స్ ప్రకారం..జీతం పొందే ట్యాక్స్ ప్లేయర్లు అవసరమైనప్పుడు కొత్త లేదా పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వీలుంది. ఈ కొత్త పన్ను విధానంలో రేట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. కొత్త విధానం ఎంచుకుంటే మినహాయింపులు, తగ్గింపులు పొందలేరని గమనించాలి. పెన్షనర్లు, ఉద్యోగులు వ్యాపారపరమైన ఆదాయం పొందలేనప్పుడు మాత్రమే కొత్త విధానం నుంచి పాత విధానానికి మారేందుకు అనుమతి ఉంటుంది.

అలాగే, వ్యాపారం ద్వారా ఆదాయాన్ని ఆర్జించే ట్యాక్స్ ప్లేయర్లు కొత్త లేదా పాత విధానాన్ని ఎంచుకునేందుకు ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ప్రస్తుత కొత్త విధానంలో వ్యాపారులు తమ పన్నులు చెల్లించిన అనంతరం వచ్చే ఏడాది పాత విధానానికి తిరిగి రావడం కష్టమని గమనించాలి. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఒక వ్యక్తికి వ్యాపారపరమైన ఆదాయం భవిష్యత్తులో ఆగిపోతే ప్రతి ఏడాదిలో కొత్త లేదా పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.

అదేవిధంగా, కన్సల్టెన్సీ నుంచి డబ్బు ఆర్జించే ట్యాక్స్ ప్లేయర్లు పొందే ఆదాయం వ్యాపారానికి వర్తించదు. జీతం ద్వారా పొందే ఆదాయానికి వర్తించదు. కన్సల్టెంట్‌లుగా ఉండే వారు ప్రతి ఏడాదిలో కొత్త విధానం నుంచి పాత, పాత నుంచి కొత్త పన్ను విధానానికి మారేందుకు అనుమతి ఉండదు. ఉద్యోగులు లేదా పెన్షనర్‌ల మాదిరిగా కాకుండా ఫ్రీలాన్స్ కార్యకలాపాల ద్వారా పొందే ఆదాయాన్ని ఆర్జించే వేతన ట్యాక్స్ ప్లేయర్లు ప్రతి ఏడాది అవసరమైన విధానానికి మారే అవకాశం ఉండదు.

ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ ఇలా :

  • ఇన్‌కమ్ ట్యాక్స్ ఇ-ఫైలింగ్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • పాన్ కార్డ్, పాస్‌వర్డ్ వివరాలతో వెబ్‌సైట్లో లాగిన్ అవ్వండి.
  • స్క్రీన్‌పై కనిపించే ఫైల్ నౌ (File Now) ఆప్షన్ క్లిక్ చేయండి.
  • పాత లేదా కొత్త పన్ను విధానం ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఆ తర్వాత అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
  • అక్కేడ మీకు ఆన్‌లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై టిక్ చేస్తే సరిపోతుంది.
  • స్టార్ట్ న్యూ ఫైలింగ్ (Start New Filing)పై క్లిక్ చేయండి.
  • మీరు క్లిక్ చేసిన తర్వాత ఇండివిజువల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • మీరు ఐటీఆర్ 1 నుంచి 7 వరకు ఆప్షన్ చూడవచ్చు.
  • మీరు ఐటీఆర్ 1 నుంచి 4 వరకు వినియోగించవచ్చు.
  • ఉద్యోగం చేసే వారు ఐటీఆర్-1ని ఎంచుకోండి.
  • ఆ తర్వాత ఫారం-16లో ఇచ్చిన అవసరమైన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్‌ చేయండి.
  • చివరలో సారాంశంతో పాటు అన్ని వివరాలను చూడవచ్చు.
  • వెరిఫికేషన్ కోసం కంటిన్యూ ఆప్షన్ ఎంచుకోండి.
  • అంతే.. మీ ఐటీఆర్ ఫైల్ ప్రాసెస్ పూర్తి అయినట్టే..

Read Also : WhatsApp Users Alert : ఇది విన్నారా? ఈ 35 స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ ఇకపై పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!