NPCI UPI ID : ఇలాంటి యూపీఐ ఐడీలను డిసెంబర్ 31లోపు డియాక్టివేట్ చేయాలి.. ఎన్‌పీసీఐ ఆదేశాలు
NPCI UPI ID : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) అనుకోకుండా చేసే లావాదేవీలను నిరోధించడానికి డిసెంబర్ 31లోగా ఇన్‌యాక్టివ్ యూపీఐ ఐడీలను డిసేబుల్ చేయాలని పేమెంట్ అప్లికేషన్లను ఆదేశించింది.

NPCI to deactivate These UPI IDs by December 31, 2023
NPCI UPI ID : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ( ఎన్‌పీసీఐ) ఇటీవల డిసెంబర్ 31లోపు ఒక ఏడాది పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూపీఐ ఐడీలను డిజేబుల్ చేయమని పేమెంట్ అప్లికేషన్‌లను ఆదేశించినట్లు నివేదిక తెలిపింది. కస్టమర్‌లు తమ మునుపటి నంబర్‌లను బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి అన్‌లింక్ చేయకుండా వారి మొబైల్ నంబర్‌లను మార్చుకున్న సందర్భాల్లో అనుకోకుండా ఫండ్ ట్రాన్సాఫర్ చేయొచ్చు.
90 రోజుల వ్యవధి తర్వాత కొత్త యూజర్లకు :
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. 90 రోజుల వ్యవధి తర్వాత కొత్త యూజర్లకు డియాక్టివేట్ చేసిన మొబైల్ నంబర్‌లను కేటాయించే అధికారం టెలికాం సంస్థలకు ఉంటుంది. యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్లలో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడంలో విఫలమైతే, అనుకోకుండా ట్రాన్సాక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు (టీపీఏపీ) పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు (పీఎస్‌పీ) తప్పనిసరిగా డిసెంబర్ 31, 2023 గడువులోగా అవసరమైన చర్యలు తీసుకోవాలి.
టీపీఏపీ, పీఎన్‌పీ ఆదేశాలు :
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఏం లేదా ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌ల వంటి ఏదైనా యూపీఐ అప్లికేషన్‌ను ఉపయోగించే వ్యక్తులు యూపీఐ ఐడీ యాక్టివ్‌గా ఉందని ఒక ఏడాది మించకుండా ఉపయోగించలేదని ధృవీకరించాల్సి ఉంటుంది. అదనంగా, యూపీఐ ఐడీలతో అనుసంధానించిన అన్ని ఫోన్ నంబర్‌లను రివ్యూ చేయడం, ఈ నంబర్‌లు ఏవీ మూడు నెలల కన్నా ఎక్కువ యాక్టివ్‌గా లేవని నిర్ధారించడం చాలా ముఖ్యం.

NPCI UPI IDs
అంతేకాకుండా, ఎన్‌పీసీఐ నుంచి వచ్చిన సర్క్యులర్ యూపీఐ ద్వారా ఎటువంటి ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీలు చేయని కస్టమర్‌ల యూపీఐ ఐడీలు అనుబంధిత యూపీఐ నంబర్‌లు, ఫోన్ నంబర్‌లను గుర్తించాలని థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు (టీపీఏపీ), పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ (పీఎస్‌పీ) బ్యాంకులను నిర్దేశిస్తుంది.
రీ-రిజిస్ట్రేషన్ తప్పనిసరి :
ఒక ఏడాది పాటు యాప్‌లను అలాంటి కస్టమర్‌లకు చెందిన యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్‌లు ఇన్‌వర్డ్ క్రెడిట్ లావాదేవీలకు డీయాక్టివేట్ అవుతాయి. సంబంధిత ఫోన్ నంబర్‌లు యూపీఐ మ్యాపర్ నుంచి డిలీట్ చేస్తుంది. ఇన్‌వర్డ్ క్రెడిట్ లావాదేవీలకు డీయాక్టివేట్ చేసిన యూపీఐ ఐడీలు, ఫోన్ నంబర్‌లను కలిగిన కస్టమర్‌లు తమ యూపీఐతో లింక్‌ను మళ్లీ యాక్టివేట్ చేసేందుకు తమ యూపీఐ యాప్‌లలో తప్పనిసరిగా రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేయించుకోవాలి. అయినప్పటికీ, వారు అవసరమైన విధంగా తమ యూపీఐ పిన్‌ని ఉపయోగించి పేమెంట్లు, ఆర్థికేతర లావాదేవీలను కొనసాగించవచ్చు.
Read Also : Boat Enigma Z20 Smartwatch : బ్లూటూత్ కాలింగ్‌తో బోట్ ఎనిగ్మా Z20 స్మార్ట్‌వాచ్, ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?