Ola Cars : బంపర్ ఆఫర్, పాత కారును కొంటే రూ. లక్ష వరకు డిస్కౌంట్!
ప్రముఖ రైడింగ్ కంపెనీలో ఒకటైన ‘ఓలా’ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా..ఫెస్టివల్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Ola
Pre-Owned Car Festival : ప్రముఖ రైడింగ్ కంపెనీలో ఒకటైన ‘ఓలా’ (OLA Cars) వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా..ఫెస్టివల్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేగాకుండా..కార్ల ప్లాట్ ఫామ్ లలో సత్తా చాటేందుకు సరికొత్త బిజినెస్ మోడల్ ను లాంచ్ చేసింది. ఓలా ప్రీ ఓన్డ్ ఫెస్టివల్ ఆఫర్ ను ముందుకు తెచ్చింది. అందులో భాగంగా…పాత కార్లపై రూ. లక్ష వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఓలా సంస్థ ఎలక్ట్రిక్ బైక్ లతో మార్కెట్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
Read More : Corona Cases : దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు, 446 మరణాలు
ఓలా సంస్థ 2 వేల కొత్త కార్లు, పాత కార్లను సేల్స్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సేల్ లో భాగంగా..పాత కార్లను కొనుగోలు చేస్తే..ఆ కారుపై లక్ష వరకు డిస్కౌంట్ అందించనుంది. అంతేగాకుండా..రెండు సంవత్సరాల వరకు ఉచిత సర్వీసింగ్, 12 నెలల వారంటీ, 7 రోజుల రిటర్న్ పాలసీని కూడా కల్పించనుంది. ఈ సందర్భంగా..ఓలా సీఈవో అరుణ్ సిర్దేశ్ ముఖ్ మాట్లాడుతూ…సంవత్సరం లోపు…ఓలా డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా..100 పాత కార్లను అమ్మేలా టార్గెట్ పెట్టుకున్నట్లు , కొత్త, పాత కార్లను అమ్మడంతో పాటు..కస్టమర్లకు పలు సర్వీసులను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. పాత కార్లు అనగానే..కొనుక్కొనే వారికి కొన్ని డౌట్స్ రావడం సహజం. వాహనానికి సంబంధించిన ఫైనాన్స్, బీమా, రిజిస్ట్రేషన్, వెహికల్ కండీషన్ తదితర వాటిని పూర్తిగా పరీక్షించిన అనంతరమే కస్టమర్లకు కార్లను వినియోగించనున్నామని ఆయన తెలిపారు.