OnePlus Nord 3 Launch : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్.. లీకైన ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord 3 Launch : వన్‌ప్లస్ నార్డ్ 3 అమెజాన్‌లో లిస్టు అయింది. ఇటీవలే కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ధృవీకరించింది. ఈ 5G ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది.

OnePlus Nord 3 Launch : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్.. లీకైన ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చుంటే?

OnePlus Nord 3 gets listed on Amazon_ Check expected India price and specs

OnePlus Nord 3 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి (OnePlus Nord 3) 5G ఫోన్ భారత మార్కెట్లోకి రాబోతోంది. ఇటీవలే బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ ధృవీకరించింది. ఇప్పుడు వన్‌ప్లస్ ఈ డివైజ్‌కు సంబంధించి అమెజాన్‌లో టీజర్‌ రివీల్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 3 కంపెనీ సిగ్నేచర్ అలర్ట్ స్లయిడర్ ఫీచర్‌ని కలిగి ఉంది. బాక్సీ డిజైన్, సర్కిల్ కార్నర్ కలిగి ఉంటుంది.

టీజర్ ప్రకారం.. హ్యాండ్‌సెట్ లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. రాబోయే వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ యూజర్లకు స్మూత్, ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కానీ, డివైజ్‌ పవర్‌ఫుల్ చిప్‌సెట్ పేరును వెల్లడించలేదు. లీక్‌ స్పెసిఫికేషన్‌ల పరంగా తెలిసినవన్నీ ఫీచర్లు కొన్ని ఉన్నాయి.

Read Also : iPhone Users Risk Warning : ఐఫోన్ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక.. మీ ఫోన్ వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేదంటే జరిగేది ఇదే..!

వన్‌ప్లస్ నార్డ్ 3 ధర ఎంతంటే? :
రాబోయే వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ భారత మార్కెట్లో రూ. 30వేల కన్నా తక్కువ ధరలో ఉండవచ్చని అంచనా. కంపెనీ ఒరిజినల్ నార్డ్ సిరీస్ ఫోన్‌లు తక్కువ ధరల రేంజ్‌లో ఉండవచ్చు. ఆ తర్వాతి జనరేషన్ ఫోన్ కూడా రూ. 30వేల లోపు ఉంటుందని అంచనా.

OnePlus Nord 3 gets listed on Amazon_ Check expected India price and specs

OnePlus Nord 3 gets listed on Amazon_ Check expected India price and specs

వన్‌ప్లస్ నార్డ్ 3 లీకైన స్పెసిఫికేషన్‌లు ఇవే :
వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చునని నివేదిక తెలిపింది. గత Nord సిరీస్ మోడల్‌ల మాదిరిగానే.. 120Hz రిఫ్రెష్ రేట్ సామర్థ్యంతో AMOLED ప్యానెల్‌తో రావొచ్చునని భావిస్తున్నారు. ఈ డివైజ్ MediaTek Dimensity 9000 SoC ద్వారా అందిస్తుంది. ఇప్పటికే, వన్‌ప్లస్ కంపెనీ ఇటీవల వన్‌ప్లస్ ప్యాడ్‌లో చూసిన హై-ఎండ్ చిప్‌సెట్ ఇదే. కెమెరా సెటప్ పరంగా చూస్తే.. వన్‌ప్లస్ Nord 3 ట్రిపుల్ రియర్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది.

50MP ప్రైమరీ కెమెరాతో రానుంది. 8MP సెన్సార్, 2MP కెమెరా ఉండవచ్చు. సెల్ఫీలకు 5G ఫోన్ 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందిస్తుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 OS ఇంకా రిలీజ్ కానందున వన్‌ప్లస్ Nord 3 ఫోన్ Android 13 OSలో రన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ డివైజ్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనా. ఛార్జర్‌తో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, వన్‌ప్లస్ Nord 3 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : OnePlus 12 – Ace 2 Pro : వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ Ace 2 ప్రో డిస్‌ప్లే, స్పెషిఫికేషన్లు లీక్.. లాంచ్ ఎప్పుడంటే?