UPI Transactions : యూపీఐ ద్వారా ఆటోమేటిక్ పేమెంట్ లిమిట్ పెరిగిందోచ్.. ఎంతంటే?

UPI Transactions : యూపీఐ పేమెంట్ చేస్తున్నారా? యూపీఐ ద్వారా చేసే ఆటో పేమెంట్ లావాదేవీలపై పరిమితి పెరిగింది. ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచుతున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.

UPI Transactions : యూపీఐ ద్వారా ఆటోమేటిక్ పేమెంట్ లిమిట్ పెరిగిందోచ్.. ఎంతంటే?

RBI MPC Limits for UPI transactions, e-mandates for recurring online payments raised

Updated On : December 14, 2023 / 12:03 AM IST

RBI UPI Transactions : యూపీఐ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. యూపీఐ అధిక జనాభాకు పేమెంట్ నిత్యావసరంగా మారిపోయింది. ప్రస్తుత యూపీఐ ద్వారా ఆటో పేమెంట్ లావాదేవీలపై పరిమితి పెరిగింది. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. మ్యూచువల్ ఫండ్స్‌కు సబ్‌స్క్రిప్షన్‌తో సహా కొన్ని కేటగిరీలకు ప్రస్తుతం ఉన్న రూ.15వేల నుంచి యూపీఐ ద్వారా ఆటోమేటిక్ పేమెంట్ల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1 లక్షకు పెంచింది.

Read Also : 2023 Year-End Discounts : హోండా కార్లపై రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్.. ఏ మోడల్ కారు ధర ఎంత తగ్గిందంటే?

ప్రస్తుతానికి, రూ. 15వేల వరకు విలువలతో తదుపరి లావాదేవీలపై కార్డ్‌లు, ప్రీపెయిడ్ పేమెంట్ టూల్స్, యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)పై ఇ-మాండేట్లు/స్టాండింగ్ సూచనలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA)లో సడలింపు అనుమతిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌కు సబ్‌స్క్రిప్షన్, ఇన్సూరెన్స్ ప్రీమియంల చెల్లింపు, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులకు ప్రతి లావాదేవీకి పరిమితిని రూ. 15వేల నుంచి రూ. లక్షకు పెంచాలని నిర్ణయించిందని సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్‌లో తెలిపింది.

నవంబర్‌లో 11.23 బిలియన్లకు పైగా లావాదేవీలు : 
రీ పేమెంట్ లావాదేవీలకు ఇ-ఆదేశాల ప్రాసెసింగ్.. నవంబర్‌లో 11.23 బిలియన్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. గత వారం డిసెంబర్ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరించిన సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ దీనికి సంబంధించిన ప్రకటన చేశారు.

RBI MPC Limits for UPI transactions, e-mandates for recurring online payments raised

RBI MPC Limits for UPI transactions

రీ పేమెంట్ కోసం ఆటోమేటిక్ డెబిట్‌లకు బ్యాంకుకు సూచనలను కలిగి ఉంటాయి. ప్రస్తుతం, మీకు కార్డ్‌లు (డెబిట్, క్రెడిట్), యూపీఐ, ప్రీపెయిడ్ చెల్లింపు టూల్స్ లేదా పీపీఐ (ఆన్‌లైన్ వాలెట్‌లు వంటివి) ఆధారంగా ఇ-మాండేట్ ఉన్నట్లయితే.. దాని విలువలో రూ. 15వేల కన్నా మించిన ప్రతి రీ పేమెంట్ ఓటీపీ ద్వారా ధృవీకరించారలి.

అంటే, పేమెంట్ చేయాల్సిన ప్రతిసారీ మొత్తం డెబిట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్‌లకు సంబంధించి పునరావృతమయ్యే ఆన్‌లైన్ పేమెంట్ల కోసం ఈ పరిమితి ఇప్పుడు రూ. 1 లక్షకు పెరిగింది. ప్రతి లావాదేవీకి రూ.15వేల పరిమితిని జూన్ 2022లో ప్రవేశపెట్టారు. అంతకు ముందు రూ.5వేలుగా ఉంది.

Read Also : Redmi 13C Sale Today : రెడ్‌మి 13సి ఫోన్ సేల్ మొదలైంది.. ఎక్కడ కొనాలి? లాంచ్ ఆఫర్ల వివరాలివే..!