Redmi K80 Series : కొత్త ఫోన్ కావాలా? అదిరే ఫీచర్లతో రెడ్‌మి K80 సిరీస్ లాంచ్.. ధర ఎంతంటే?
Redmi K80 Series : షావోమీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లైనప్ రెడ్‌మి కె80 సిరీస్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొత్తం రెండు మోడల్‌లను కలిగి ఉంది.

Redmi K80 Series With 120Hz AMOLED Displays
Redmi K80 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? చైనాలో షావోమీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లైనప్ రెడ్‌మి కె80 సిరీస్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొత్తం రెండు మోడల్‌లను కలిగి ఉంది. అందులో రెడ్‌మి కె80, రెడ్‌మి కె80 ప్రో మోడల్స్ ఉన్నాయి.
ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లతో అమర్చి 120Hz అమోల్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. రెడ్‌మి కె80 ప్రో 2.5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన అదనపు 50ఎంపీ ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్ నుంచి బెనిఫిట్స్ అందిస్తుంది. రెడ్‌మి కె80 సిరీస్ ఐపీ68+ఐపీ69-రేటెడ్ బిల్డ్, భద్రతపరంగా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
రెడ్‌మి కె80, రెడ్‌మి కె80ప్రో ధర :
రెడ్‌మి కె80 ఫోన్ 12జీబీ+ 256జీబీ మోడల్ ధర సీఎన్‌వై 2,499 (దాదాపు రూ. 29వేలు) నుంచి ప్రారంభమవుతుంది. సీఎన్‌వై 3,599 (దాదాపు రూ. 42వేలు) ధరతో 16జీబీ + 1టీబీ వేరియంట్‌తో 4 ఇతర కాన్ఫిగరేషన్‌లలో పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ మౌంటైన్ గ్రీన్, మిస్టీరియస్ నైట్ బ్లాక్, స్నో రాక్ వైట్, ట్విలైట్ మూన్ బ్లూ అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అదే సమయంలో, రెడ్‌మి కె80 ప్రో బేస్ 12జీబీ+ 256జీబీ వేరియంట్ సీఎన్‌వై 3,699 (దాదాపు రూ. 43వేల) వద్ద ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో కూడా అందుబాటులో ఉంది.
టాప్-ఎండ్ 16జీబీ + 1టీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 4,799 (దాదాపు రూ. 56వేలు)గా ఉంటుంది. షావోమీ రెడ్‌మి కె80ప్రో ఛాంపియన్స్ ఎడిషన్ మోడల్‌ను కూడా ప్రవేశపెట్టింది. ‘ఆటోమొబిలి లంబోర్ఘిని రేసింగ్ టీమ్’ బ్రాండింగ్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ ధర సీఎన్‌వై 4,999 (సుమారు రూ. 58వేలు) ఉంటుంది. రెడ్‌మి కె80 ప్రో మౌంటైన్ గ్రీన్, మిస్టీరియస్ నైట్ బ్లాక్, స్లో రాక్ వైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మి కె80, రెడ్‌మి కె80ప్రో స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి కె80 సిరీస్‌లోని 2 మోడల్‌లు 6.67-అంగుళాల (1,440 x 3,200 పిక్సెల్‌లు) 12-బిట్ అమోల్డ్ డిస్‌ప్లేతో 2కె రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తాయి. డిస్‌ప్లేలు 3,200 నిట్‌ల గరిష్ట ప్రకాశం, 2160Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ హెచ్‌డీఆర్10+ డాల్బీ విజన్ సపోర్ట్‌ను అందిస్తాయి. బేస్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. అయితే, రెడ్‌మి ప్రో క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీని పొందుతుంది.
రెడ్‌మి కె80, రెడ్‌మి కె80ప్రో 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తాయి. సరికొత్త షావోమీ హైపర్ఓఎస్ 2.0పై రన్ అవుతాయి. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. రెడ్‌మి కె80 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చి ఉంది. ఇందులో 50ఎంపీ లైట్ హంటర్ 800 ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. రెడ్‌మి కె80ప్రో బేస్ మోడల్ మాదిరిగా కచ్చితమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే, 2.5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో మూడో 50ఎంపీ ఫ్లోటింగ్ టెలిఫోటో లెన్స్‌ను అందిస్తుంది.
కనెక్టివిటీ పరంగా, రెండు హ్యాండ్‌సెట్‌లు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.4, వై-ఫై 7, 5జీ, 4జీ వోల్టే సపోర్టుతో వస్తాయి. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్ కూడా ఉన్నాయి. రెడ్‌మి కె80 120డబ్ల్యూ (వైర్డ్), 50డబ్ల్యూ (వైర్‌లెస్) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. అయితే, రెడ్‌మి కె80 ప్రో 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,550mAh బ్యాటరీని అందిస్తుంది.
Read Also : Redmi A4 5G : రెడ్‌మి A4 5జీ ఫోన్ వాడుతున్నారా? ఎయిర్‌టెల్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్టు చేయదు.. ఎందుకంటే?