Triumph: ఆంధ్రాలో అదరగొట్టిన Triumph Speed 400.. వైజాగ్‭లో తొలి బ్యాచ్‭ విడుదల

కొత్త కస్టమర్లు 16,000 కి.మీల సర్వీస్ విరామాలతో రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో పాటు మరో మూడేళ్లపాటు పొడిగించిన వారంటీ సైతం పొందొచ్చని కంపెనీ తెలిపింది

Triumph: ఆంధ్రాలో అదరగొట్టిన Triumph Speed 400.. వైజాగ్‭లో తొలి బ్యాచ్‭ విడుదల

Updated On : August 14, 2023 / 9:04 PM IST

Speed 400: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Triumph Speed 400ను Triumph వైజాగ్ డీలర్‌షిప్‌ వద్ద ఆగస్టు 4న వైజాగ్ లో డెలివరీ చేశారు. జూన్ 27న లండన్‌లో విడుదల చేసిన ఈ Triumph Speed 400, Scrambler 400 X వినియోగదారుల నుంచి అపూర్వమైన స్పందనను పొందాయి. గత వారం పూణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో విజయవంతంగా విడుదల చేసిన తర్వాత, వైజాగ్‌లో మొదటి బ్యాచ్ వాహనాల డెలివరీ చేయటానికి నిర్వహించిన కార్యక్రమంలో Triumph Speed 400కి అద్భుతమైన స్పందన లభించిందని కంపెనీ పేర్కొంది.

Farm loan waiver: రైతుల‌కు కేసీఆర్ స‌ర్కార్ శుభవార్త.. రూ.ల‌క్షలోపు రుణాలు మాఫీ

కొత్త కస్టమర్లు 16,000 కి.మీల సర్వీస్ విరామాలతో రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో పాటు మరో మూడేళ్లపాటు పొడిగించిన వారంటీ సైతం పొందొచ్చని కంపెనీ తెలిపింది. బజాజ్ ఆటో లిమిటెడ్ తన కొత్త చకన్ ప్లాంట్‌లో తయారు చేసిన Speed 400 వైజాగ్ లోని Triumph డీలర్‌షిప్‌లో ఎక్స్-షోరూమ్ ధర రూ.2.33 లక్షలకు అందుబాటులో ఉంటుందట. Speed 400 కోసం బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. ఆసక్తి గల కస్టమర్‌లు తమ బైక్‌లను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.