TweetDeck : జూలై 1 నుంచి ఆ సిస్టమ్స్‌లో TweetDeck పనిచేయదు.. ఎందుకంటే?

TweetDeck : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ నిర్వహణ కోసం ప్రవేశపెట్టిన సోషల్ మీడియా డాష్‌బోర్డ్ అప్లికేషన్ TweetDeck ఇక పనిచేయదు.

TweetDeck : జూలై 1 నుంచి ఆ సిస్టమ్స్‌లో TweetDeck పనిచేయదు.. ఎందుకంటే?

Twitter To Remove Tweetdeck For Mac On July 1, But Why

Updated On : June 2, 2022 / 10:06 PM IST

TweetDeck : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ నిర్వహణ కోసం ప్రవేశపెట్టిన సోషల్ మీడియా డాష్‌బోర్డ్ అప్లికేషన్ TweetDeck ఇక పనిచేయదు. స్టాండెడ్‌లోన్ Mac యాప్‌ మాత్రమే జూలై 1 నుంచి అందుబాటులో ఉండదు. 9To5Google నివేదికల ప్రకారం.. ఇది కేవలం ఒక నెల మాత్రమే అందుబాటులో ఉంటుందని అలర్ట్ చేసింది. ట్విట్టర్ బ్లూ బ్యానర్‌ కలిగిన టాప్ యూజర్లలో Mac యాప్‌ల కోసం TweetDeckని Twitter ప్రారంభించింది. ఈ TweetDeckను మరింత మెరుగుపర్చేందుకు కొత్త ప్రివ్యూను టెస్టింగ్ చేసేందుకు దృష్టి పెట్టినట్టు కంపెనీ తెలిపింది.

అందుకే Mac యాప్ లో భాగమైన TweetDeck అప్లికేషన్ తొలగించనున్నామని TweetDeck టీం ట్వీట్ చేసింది. జూలై 1 ఈ ట్వీట్ డెక్ అప్లికేషన్ ట్విట్టర్ మ్యాక్ యూజర్లకు అందుబాటులో ఉండదని తెలిపింది. నివేదిక ప్రకారం.. Mac TweetDeck గత ఏడాదిలోనే వెబ్ వెర్షన్‌కు అనుగుణంగా ట్విట్టర్ తీసుకువచ్చింది.

Twitter To Remove Tweetdeck For Mac On July 1, But Why (1)

Twitter To Remove Tweetdeck For Mac On July 1, But Why (1)

అదే సమయంలో యాప్ పెద్దగా యూజర్ల నుంచి రెస్పాన్స్ పొందలేదు. TweetDeck Mac యాప్‌ని ఆకస్మికంగా రద్దు చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఇది వెబ్‌సైట్ రేపర్ మాత్రమే.. Twitter  కోసం ప్రత్యేకించి ఎలాంటి మరో అప్లికేసన్ అవసరం లేదు. గత ఏడాదిలో మైక్రోబ్లాగింగ్ సైట్ TweetDeck కొత్త మెరుగైన వెర్షన్ రిలీజ్ చేసింది. అదే సమయంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోని యూజర్ల కోసం కొత్త ఫీచర్లను ట్విట్టర్ టెస్టింగ్ చేస్తోంది.

Read Also : Realme Pad X India : రియల్‌మి నుంచి Realme Pad X టాబ్లెట్ వస్తోంది.. ఎప్పుడంటే?