Vi 5G Network Launch : దేశంలో త్వరలో వోడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులు.. ఫస్ట్ ఆ రెండు ప్రాంతాల్లోనే..!
Vi 5G Network Launch : దేశంలో వోడాఫోన్ ఐడియా 5G నెట్‌వర్క్ సర్వీసులను త్వరలో ప్రారంభించనుంది. ఈ 5జీ సర్వీసులను ముందుగా ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లోనే ప్రారంభించనుంది. ఇంకా అధికారికంగా తేదీని ప్రకటించలేదు.

Vi Teases Arrival of 5G Network in Select Locations in Pune and Delhi
Vi 5G Network Launch : వోడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) అతి త్వరలో భారత మార్కెట్లో 5జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా విషయాన్ని రివీల్ చేసింది. ఇతర టెలికం పోటీదారుల్లో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో దేశంలో తమ 5జీ నెట్‌వర్క్ సర్వీసులను ప్రారంభించాయి.
సరిగ్గా ఏడాది తర్వాత దేశంలోని రెండు నగరాల్లోని కొన్ని ప్రదేశాలకు 5G కనెక్టివిటీ తీసుకురానుందని టెలికాం ఆపరేటర్‌లు వెల్లడించాయి. ప్రభుత్వం కేటాయించిన స్పెక్ట్రమ్‌పై హై-స్పీడ్ మిల్లీమీటర్-వేవ్ (mmWave) స్పెక్ట్రమ్ బ్యాండ్‌పై 3.7జీబీపీఎస్ కన్నా ఎక్కువ గరిష్ట వేగాన్ని సాధించిందని, దేశంలో తన 5జీ నెట్‌వర్క్ సర్వీసులను త్వరలో ప్రారంభించవచ్చని విఐ కంపెనీ పేర్కొంది.
Read Also : WhatsApp Voice Chat : వాట్సాప్‌లో గ్రూపు కాల్స్ కోసం వాయిస్ చాట్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?
దేశంలో త్వరలో 5జీ కనెక్టివిటీని సూచించేలా టెలికాం ఆపరేటర్ వెబ్‌సైట్ ఇటీవలే అప్‌డేట్ చేసింది. ముందుగా పూణె, ఢిల్లీలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుందని కంపెనీ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ నగరాల్లో 5జీ కనెక్టివిటీ ఎప్పుడు? ఎక్కడ అందుబాటులో ఉంటుందనే దానిపై ఆపరేటర్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. విఐ వెబ్‌సైట్ ప్రకారం.. 5జీ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయ్యే కస్టమర్‌లకు 5జీ రెడీ సిమ్ అవసరమని గమనించాలి.
5జీ రెడీ ఫోన్లలో మాత్రమే విఐ 5జీ సర్వీసులు :
ఈ సంవత్సరం ప్రారంభంలో విఐ 4జీ సిమ్ కార్డ్‌లు 5జీ రెడీగా ఉన్నాయని వివరిస్తూ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంటే.. వోడాఫోన్ ఐడియా యూజర్లు 5జీ-సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లో మాత్రమే ఈ సర్వీసులను యాక్సస్ చేయగలరు. విఐ స్టోర్లలో 5జీ రెడీ సిమ్ కార్డ్‌లను అందిస్తామని టెలికాం ఆపరేటర్ పేర్కొంది.

Vi 5G Network in Pune and Delhi
ఈ ఏడాది ప్రారంభంలోనే ఎమ్‌ఎమ్‌వేవ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌లో 3.7జీబీపీఎస్ గరిష్ట వేగాన్ని సాధించినట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, 3.5జీహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ 1.5జీబీపీఎస్ వరకు ఎక్కువగా ఉంది. ఎమ్‌వేవ్ ట్రయల్స్ పూణేలో నిర్వహించగా.. సబ్-6జీహెచ్‌జెడ్ స్పెక్ట్రమ్ బ్యాండ్ ట్రయల్స్ ముందుగా పూణే, గాంధీనగర్‌లో జరిగాయి.
ఎయిర్ టెల్, జియో 5జీ నెట్‌వర్క్ మొత్తం 10వేల నగరాల్లో :
దేశంలోని అనేక నగరాలు, పట్టణాలలో ఇప్పటికే 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెలికాం ఆపరేటర్‌లైన ఎయిర్‌టెల్, జియో రెండింటి కన్నా విఐ ఇప్పటికే వెనుకబడి ఉంది. ఎయిర్‌టెల్ ‘5జీ ప్లస్’ జియో ‘True 5G’ నెట్‌వర్క్‌లు మొత్తం 10వేల నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు నివేదించింది. ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ప్రస్తుతం యాక్టివ్ ప్లాన్‌లతో సబ్‌స్క్రైబర్‌లకు 5జీ నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ యాక్సెస్‌ను అందిస్తున్నాయి. ఇతర టెలికం ఆపరేటర్ల మాదిరిగానే విఐ కూడా త్వరలో 5జీ నెట్‌వర్క్ సర్వీసులను ప్రారంభించేందుకు రెడీగా ఉంది.