WhatsApp down : వాట్సాప్‌కు ఏమైంది.. ఒక్కసారిగా డౌన్.. లాగిన్ అవ్వట్లేదు.. మెసేజ్‌లు పోవట్లేదు.. యూజర్ల ఇబ్బందులు..!
WhatsApp down : వాట్సాప్ సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. చాలామంది వాట్సాప్ యూజర్లకు కనీసం లాగిన్ అవ్వడం లేదు. మెసేజ్‌లు కూడా పోవడం లేదని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.

WhatsApp down
WhatsApp down : వాట్సాప్ డౌన్ అయింది. వాట్సాప్ సర్వీసుల్లో ఒక్కసారిగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రోజు (శనివారం) సాయంత్రం చాలా మంది వినియోగదారులు తమ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పనిచేయడం లేదని ఫిర్యాదులు చేశారు. వాట్సాప్ మెసేజ్‌లు కూడా డెలివరీ కాలేదనే ఫిర్యాదులు ఎక్కువగా వెల్లువెత్తాయి.
డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. శనివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో 460కి పైగా వాట్సాప్ ఇష్యూ నివేదికలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా వినియోగదారులు తమ ఫిర్యాదులను పోస్టు చేస్తున్నారు. అందులో 81 శాతం మెసేజ్‌లు వెళ్లడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి.
కొంతమంది వినియోగదారులు తమ స్టేటస్‌లను అప్‌డేట్ చేయలేకపోతున్నారని లేదా మెసేజ్‌లు పంపలేకపోతున్నామని ఫిర్యాదు చేశారు. మరికొందరు యాప్‌లోకి కనీసం లాగిన్ కూడా అవ్వలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీవ్ర అంతరాయాన్ని పరిష్కరిస్తూ వాట్సాప్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.
ఈ ఏడాదిలో ఫిబ్రవరి 28న కూడా వాట్సాప్ మెసేజింగ్ సర్వీస్ తీవ్ర అంతరాయం ఎదుర్కొంది. డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. వినియోగదారులు తమ మెసేజ్‌లు డెలివరీ కావడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 5వేల కన్నా ఎక్కువ నివేదికలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 530 మిలియన్లకు పైగా భారతీయులు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. దాదాపు 3 బిలియన్ల మంది వాట్సాప్ ఉపయోగిస్తున్నారు.
యూపీఐ యాప్‌లకు అంతరాయం :
వాట్సాప్‌తో పాటు, యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లు కూడా తీవ్ర అంతరాయం ఎదుర్కొన్నాయి. దాంతో అనేక మంది వినియోగదారులు అసౌకర్యానికి గురయ్యారు. 30 రోజుల వ్యవధిలో దేశంలో మూడోసారి యూపీఐ సర్వీసులకు అంతరాయం కలిగింది. “ఇటీవీల సాంకేతిక సమస్యల కారణంగా పాక్షికంగా యూపీఐ లావాదేవీలు నిలిచిపోయినట్టు ఎన్పీసీఐ పోస్ట్‌లో వివరించింది.
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ల యాప్‌లలో లావాదేవీలను పూర్తి చేయలేకపోయారు. బ్యాంక్ ఆధారిత యూపీఐ యాప్స్ కూడా పనిచేయడం లేదు. దాంతో అనేక మంది వ్యాపారాల లావాదేవీలు అంతరాయం కలిగింది.
డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. భారత్‌లో 3వేల మందికి పైగా వినియోగదారులకు యూపీఐ యాప్‌ల సమస్యలను నివేదించారు. అయితే, ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత యూపీఐ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. దాంతో యూపీఐ వినియోగదారులు ఆన్‌లైన్ లావాదేవీలను తిరిగి కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 2న యూపీఐ సర్వీసులు నిలిచిపోవడంతో సోషల్ మీడియాలో వినియోగదారులు నిరాశను వ్యక్తం చేశారు.