Sound Charging Technology : షియోమీ.. సౌండ్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకోస్తోంది..!

చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. సౌండ్ టెక్నాలజీని రివీల్ చేసింది. ఇటీవలే దీనికి సంబంధించి పేటెంట్ హక్కుల కోసం దాఖలు చేసినట్టు సమాచారం. గత దశాబ్ద కాలంలో స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో అగ్రాగామిగా నిలిచిన షియోమీ..

Sound Charging Technology : షియోమీ.. సౌండ్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకోస్తోంది..!

Xiaomi Sound Charging Technology

Updated On : June 24, 2021 / 8:47 PM IST

Xiaomi Sound Charging Technology : చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. సౌండ్ టెక్నాలజీని రివీల్ చేసింది. ఇటీవలే దీనికి సంబంధించి పేటెంట్ హక్కుల కోసం దాఖలు చేసినట్టు సమాచారం. గత దశాబ్ద కాలంలో స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో అగ్రాగామిగా నిలిచిన షియోమీ.. స్క్రీన్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ పవర్, వైర్ లెస్ కనెక్టివిటీ టెక్నాలజీతో వేగంగా డెవలప్ అయింది. బ్యాటరీ టెక్నాలజీ మాత్రం అనుకున్నంత వేగంగా డెవలప్ కాలేదు.

గత ఏడాది నుంచి ఈ టెక్నాలజీలో కొత్తపుంతలు తొక్కుతున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు ఛార్జింగ్ వేగంగా అయ్యేందుకు పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. షియోమీ ఈ మద్యనే 200వాట్ చార్జర్ డెవలప్ చేసింది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు ‘సౌండ్ ఛార్జింగ్’ టెక్నాలజీకి సంబంధించి పేటెంట్ కోసం దాఖలు చేసినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. షియోమీ రాష్ట్ర సంస్థ చైనా నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది.

ఈ పేటెంట్ టెక్నాలజీ ద్వారా ఒక డివైజ్‌ను ధ్వని ద్వారా ఛార్జ్ చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ‘సౌండ్ ఛార్జింగ్’ టెక్నాలజీలో రెండు ముఖ్యమైన భాగాలు ఉన్నట్లు పేటెంట్ ద్వారా తెలుస్తోంది. జనవరిలో కంపెనీ తన ‘ఎయిర్ ఛార్జ్’ టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ ద్వారా గదిలో ఎక్కడ స్మార్ట్ ఫోన్ ఉంచినా ఫోన్ చార్జ్ చేసుకోవచ్చు. ఫోన్ ఛార్జ్ చేసేందుకు బీమ్ ఫార్మింగ్ అనే ఫోకస్టింగ్ టెక్నాలజీని వినియోగిస్తోంది.