Revanth Reddy Vs Pushpa : అసెంబ్లీలో అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై 10టీవీ ప్రైమ్ డిబేట్..

Revanth Reddy Vs Pushpa : పుష్ప థియేటర్ లో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అనుమతి లేకుండా అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లాడని, రోడ్ షో చేశాడని, తొక్కిసలాట జరిగిందని, ఒక మహిళ చనిపోయిందని, ఆమె కొడుకు ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్నాడని, ఆ విషయం చెప్పినా అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లలేదని, ఆ తర్వాత కూడా బయటకు వెళ్తూ మళ్లీ రోడ్ షో చేశారని.. ఇలా చాలా అంశాలపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యారు. రాంగ్ ఇన్ ఫర్మేషన్, ఫాల్స్ అలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రస్తావించకుండానే రేవంత్ కి కౌంటర్ ఇచ్చారు అల్లు అర్జున్. పుష్ప వర్సెస్ రేవంత్ రెడ్డి.. ఈ అంశంపై 10టీవీ ప్రైమ్ డిబేట్..
Also Read : సినిమా వాళ్లపై సీఎం ఫైర్.. అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?