హైదరాబాద్‌లో కొత్తగా 172 డెంగ్యూ కేసులు

ఆరు రోజుల్లో హైదరాబాద్‌లో 172డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. నగర వ్యాప్తంగా ఇలా ఉంటే ఆరు రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 633కేసులు ఉన్నట్లు గుర్తించారు. గతేడాది కంటే ప్రస్తుత సంవత్సరంలో డెంగ్యూ బాధితులు భారీగా పెరిగి పోయారు. ఇతర వ్యాధుల కారణంగా డెంగ్యూ వాపిస్తున్న వారు 5-6శాతం ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు.
‘మలేరియా వంటి జబ్బులతోనూ డెంగ్యూ వాపిస్తున్నట్లు తెలుస్తుంది. న్యూమోనియా, గ్యాస్ట్రో ఇంటిస్టినల్ ఇన్ఫెక్షన్స్ కారణంగానూ డెంగ్యూ సంక్రమిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి అనేక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు గురి కావడమే కాక, శరీరంలోని రోగ నిరోధక శక్తిని క్రమంగా తగ్గిస్తోంది’ అని జనరల్ ఫిజిషయిన్ డాక్టర్ రాహుల్ అగర్వాల్ తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘డెంగ్యూ సీజన్ ముగిసిందని అనుకున్నాం. క్రమంగా తగ్గుతాయనుకుంటే వాటి సంఖ్య అలానే ఉంది. గతేడాది కంటే బాధితుల సంఖ్య మూడో వంతుకు పెరిగింది. వర్షాలు ఎక్కువగా పడటం. డ్రైనేజి వ్యవస్థ బలహీనంగా ఉండడంతో ఈ సమస్యలకు కారణం అయ్యాయి’ అని తెలిపారు.