New Police Stations : హైదరాబాద్‌లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే..

New Police Stations : సైబరాబాద్‌లో మేడ్చల్‌, రాజేంద్రనగర్‌.. రాచకొండలో మహేశ్వరం జోన్‌ లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌లో దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్‌, వారాసిగూడ, బండ్లగూడ, ఐఎస్‌ సదన్‌, గుడిమల్కాపూర్, మాసబ్‌ట్యాంక్‌, ఫిలింనగర్‌, మధురానగర్‌, బోరబండలో కొత్త పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు కానున్నాయి.

New Police Stations : హైదరాబాద్‌లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే..

New Police Stations(Photo : Google)

Updated On : May 6, 2023 / 10:59 PM IST

New Police Stations : శాంతి భద్రతల పరిరక్షణకు, పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జంటనగరాల్లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.

హైదరాబాద్‌లో 12 మంది ఏసీపీ డివిజన్లు, సైబరాబాద్‌లో 3 డీసీపీ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ జోన్ల కోసం కొత్తగా ఆరుగురు డీసీపీలను నియమించనున్నారు. ప్రతి జోన్‌కు మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇక, హైదరాబాద్ సైబరాబద్ పరిధిలో కొత్తగా 11 లా అండ్‌ ఆర్డర్‌, 13 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు, ప్రతి ఏరియాలో సైబర్‌ క్రైమ్‌, నార్కోటిక్‌ వింగ్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే, కొత్తగా 2 టాస్క్‌ఫోర్స్‌ జోన్లు ఏర్పడనున్నాయి.

Also Read..Vemulawada Constituency: బండి సంజయ్ కాకపోతే.. వేములవాడలో బీజేపీ నుంచి పోటీ చేసేదెవరు?

సైబరాబాద్‌లో మేడ్చల్‌, రాజేంద్రనగర్‌.. రాచకొండలో మహేశ్వరం జోన్‌ లు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్‌లో దోమలగూడ, సెక్రటేరియట్, ఖైరతాబాద్‌, వారాసిగూడ, బండ్లగూడ, ఐఎస్‌ సదన్‌, గుడిమల్కాపూర్, మాసబ్‌ట్యాంక్‌, ఫిలింనగర్‌, మధురానగర్‌, బోరబండలో కొత్త పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు కానున్నాయి. సైబరాబాద్‌ పరిధిలో మోకిల్లా, అల్లాపూర్, సూరారం, కొల్లూరు‌, జినోమ్‌ వ్యాలీలో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.