తెలంగాణలో కొత్తగా 415 కరోనా కేసులు, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 91

తెలంగాణలో కొత్తగా 415 కరోనా కేసులు, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 91

Updated On : December 31, 2020 / 11:16 AM IST

415 new corona cases register in Telangana : తెలంగాణలో కొత్తగా కరోనా 415 కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,86,354కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 1,541 మంది మృతి చెందారు.

బుధవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 316 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,78,839 మంది డిశ్చార్జ్ అయ్యారు. 3,823 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో 5,974 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53 శాతం, రికవరీ రేటు 97.37 శాతంగా ఉన్నదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 43,413 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 68,82,694 నమూనాలకు పరీక్షలు చేశారు.

కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 91, రంగారెడ్డి జిల్లాలో 43, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 39, కరీనంగర్‌లో 33, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 31 చొప్పున ఉన్నాయి.