తెలంగాణలో కొత్తగా 461 కరోనా కేసులు, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 108

తెలంగాణలో కొత్తగా 461 కరోనా కేసులు, జీహెచ్ఎంసీలో అత్యధికంగా 108

Updated On : January 1, 2021 / 11:48 AM IST

new corona cases registered in Telangana : తెలంగాణలో కొత్తగా 461 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 108 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,86,815 కు చేరుకున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,544 మంది బాధితులు మృతి చెందారు. రాష్ట్రంలో 5,815 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి కోలుకుని 2,79,456 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో కొత్తగా 20,036 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 256 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 24 గంటల్లో 7,36,680 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 13,411 మంది మరణించారు.

ఓవైపు కరోనా వైరస్ మరోవైపు కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకోకముందే కొత్త స్టెయిన్ రూపంలో మరో ముప్పు వచ్చి పడింది. భారత్ లో 25 కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులను గుర్తించారు. యూకే నుంచి వచ్చిన వారికి సోకినట్లు నిర్ధారించారు.