Lockdown Liquor Shops మద్యం షాపుల ముందు క్యూ కట్టిన మందుబాబులు

Ahead Of Partial Lockdown Massive Rush At Wine Shops In Hyderabad
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతూ ఉండగా.. లాక్‌డౌన్ ప్రకటన చేసేసింది తెలంగాణ ప్రభుత్వం.. ముందస్తు ప్రచారం మొదలవగానే.. ఈలోపే మందు తెచ్చుకుంటే బెటరని భావించిన మందుబాబులు వైన్స్ ముందు క్యూ కట్టారు. అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కేబినేట్ పది రోజులు లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోగా.. వైన్స్ ముందు మందుబాబులు క్యూ పెరిగిపోయింది.
రాజధాని హైదరాబాద్‌లో మందుబాబులు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మందు షాపుల ముందు క్యూలో నుంచున్నారు. ఇంట్లో నిత్యావసర సరుకులు ఉన్నాయో లేదో అన్న బాధ్యత లేని వారు సైతం మా వైన్స్ షాపుల పరిస్థితి ఏంటీ అన్న భయంతో షాపుల ముందు వాలిపోయారు.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే మద్యం షాపులు మూసేయగా.. వేలకువేలు పెట్టి మందు కొనుక్కొనే పరిస్థితి రాగా.. ఈసారి అటువంటి ఇబ్బందులు పడకూడదని కరోనాను సైతం లెక్కచేయకుండా ముద్యం షాపుల ముందు వాలిపోయారు. ఈసారి సెకండ్ వేవ్ లాక్ డౌన్‌లో కూడా మద్యం షాపులు మూసేస్తారా? లేకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం ఇచ్చినట్లుగా ఇస్తారా? అనే అయోమయం సాగుతోంది.
ప్రభుత్వం మద్యం షాపులను కూడా కిరాణషాపుల్లాగే, ఉదయం 6గంటలకే తెరిచేందుకు అనుమతి ఇస్తుందా? ఇవ్వదా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.