Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రయాణికులు రైల్వే, బస్ స్టేషన్లకు ముందుగానే బయలుదేరాలని సూచించారు. మెట్రో సేవలను వాడుకోవాలని కోరారు.
Hyderabad Traffic Restrictions Representative Image (Image Credit To Original Source)
- ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- టివోలి ఎక్స్ రోడ్స్ నుంచి ప్లాజా ఎక్స్ రోడ్స్ మధ్య రహదారి మూసివేత
- రైల్వే, బస్ స్టేషన్లకు ముందుగానే బయలుదేరాలని సూచన
Hyderabad: జనవరి 26న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కారణంగా ఆ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. రహదారులను మూసి వేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరవాసులు అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది.
టివోలి ఎక్స్ రోడ్స్ నుంచి ప్లాజా ఎక్స్ రోడ్స్ మధ్య రహదారి మూసివేయనున్నారు. సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ, ప్యాట్నీ, ఎస్బీఐ, ప్లాజా, సీటీవో, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉపకార్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్‌బండ్, బాలమ్రాయ్, రసూల్‌పురా, ప్యారడైజ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
ప్రయాణికులు రైల్వే, బస్ స్టేషన్లకు ముందుగానే బయలుదేరాలని సూచించారు. మెట్రో సేవలను వాడుకోవాలని కోరారు. బేగంపేట, కార్ఖానా, జేబీఎస్, ప్యాట్నీ, సంగీత్ ఎక్స్ రోడ్స్, టివోలి, బోయిన్పల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను ఇతర మార్గాలకు డైవర్షన్ చేసేలా ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 8712662999 నెంబర్ కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.
