Nehru Zoo Park : హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో విషాదం.. ఏనుగు దాడిలో యానిమల్ కీపర్ మృతి

అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చిన ఏనుగు యానిమల్ కీపర్ షాబాజ్ పై దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన షాబాజ్ ను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Nehru Zoo Park : హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో విషాదం.. ఏనుగు దాడిలో యానిమల్ కీపర్ మృతి

Nehru Zoo Park animal keeper died

Updated On : October 7, 2023 / 5:57 PM IST

Nehru Zoo Park – Animal Keeper Died : హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ లో విషాదం నెలకొంది. ఏనుగు దాడిలో షాబాజ్ అనే యానిమల్ కీపర్ మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం నెహ్రూ జూపార్క్ లో యానిమల్ కీపర్ షాబాజ్ పై ఏనుగు దాడి చేసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డారు.

చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా షాబాజ్ మృతి చెందారు. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి. అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చిన ఏనుగు యానిమల్ కీపర్ షాబాజ్ పై దాడి చేసింది.

Road Accident : మోటార్ సైకిల్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. భర్త ఎదుటే భార్య మృతి

దీంతో తీవ్ర గాయాలపాలైన కేర్ టేకర్ షాబాజ్ ను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే అతను మృతి చెందారు. షాబాజ్ మృతితో అతని కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నారు.