గాంధీ ఆస్పత్రిలో మరో కరోనా పాజిటివ్ కేసు..?

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 08:11 AM IST
గాంధీ ఆస్పత్రిలో మరో కరోనా పాజిటివ్ కేసు..?

Updated On : March 17, 2020 / 8:11 AM IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న తెలంగాణలో కోరలు విప్పింది. రాష్ట్రంలో ఐదో పాజిటివ్ కేసు నమోదు అయినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. నిన్న ఇండోనేషియా నుంచి నగరానికి వచ్చిన పది మందిలో ఒకరికి కరోనా సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అతడి శాంపిల్స్ ను పరీక్షల కోసం పూణెలోని ల్యాబ్ కు పంపించారు.

అధికారికంగా ప్రకటించకపోయినా పదిమందిలో ఒకరికి వైరస్ పాజిటివ్ గా నమోదైనట్లుగా వైరాలజీ డిపార్ట్ మెంట్ తెలిపింది. దీనికి సంబంధించి మరోసారి రీచెక్ చేయడానికి పూణెకు పంపారు. నిన్నటి వరకు ఏదైనా పాజిటివ్ కేసు వస్తే దానికి సంబంధించి శాంపిల్స్ పూణెకు పంపించాల్సివచ్చేంది. 

See Also | కరోనా భయం.. కేంద్రమంత్రి మురళీధరన్ గృహ నిర్భందం

కానీ ఫైనల్ రిపోర్టుకు సంబంధించిన కిట్ ను తెలంగాణకు పంపించారు. దీంతో ఇవాళ్టి నుంచి ఇక్కడే ఫైనల్ రిపోర్టు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రక్తనమూన టెస్టు చేయడానికి వైరాలజీ డిపార్ట్ మెంట్ దాదాపు 6 గంటల సమయం పడుతుంది. మరోసారి రీచెక్ చేయడానికి అతనికి మళ్లీ టెస్టు చేస్తున్నారు. ఇది పాజిటివ్ అని వస్తే కనుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ ఐదో కేసుగా నమోదు అయ్యే అవకాశం ఉంది. 

మరోవైపు పాజిటివ్ వచ్చిన నలుగురికి సంబంధించిన కాంటాక్ట్స్ ఎవరైతే ఉంటారో వారి లిస్టును తయారు చేస్తున్నారు. వారికి హోం క్వారంటైన్ చేయడం, లేదా ఐసోలేషన్ చేయడానికి ఆస్పిటల్ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.